Mutual Funds: ఎన్విడియాలో పెట్టుబడి పెట్టిన భారతీయ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
అమెరికాకు చెందిన చిప్‌మేకర్ ఎన్విడియాలో నెలకొన్న నాయకత్వ సంక్షోభం తీవ్రతరం కావడంతో నవంబర్ 12న ఉదయం యూఎస్ ట్రేడింగ్‌లో దాని షేర్లు 6.04 శాతం పడిపోయి 163.23 డాలర్లకు చేరాయి. ఇది అంతకుముందు ముగింపు ధర అయిన $173.73 కన్నా $10.50 తక్కువ. ఈ స్టాక్ ఇప్పుడు తన 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన $243.37 నుంచి దాదాపు 33 శాతం పడిపోయింది. ఎన్విడియా సహ-వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేయగా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్ తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించడంతో ఈ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
భారతీయ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ఇది గందరగోళంగా మారిది. భారతీయ మ్యూచువల్ ఫండ్లు ఎన్విడియాలో ఏ మేర పెట్టుబడి పెట్టారో చూద్దాం. ఏస్ ఎంఎఫ్ అక్టోబర్ 2026 పోర్ట్‌ఫోలియో డేటా విశ్లేషణలో ఎన్విడియాలో ప్రత్యక్ష వాటాలు కలిగిన 13 భారతీయ మ్యూచువల్ ఫండ్ పథకాలు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లు (ETFలు)ఉన్నాయి. ఈ కేటాయింపులు పథకాల ఆస్తులలో 0.63 శాతం నుంచి 12.12 శాతం వరకు ఉన్నాయి. అత్యధిక వాటా మిరే అసెట్ S&P 500 టాప్ 50 ETFలో ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలో ఎన్విడియాకు 12.12 శాతం వాటా ఉంది. మిరే అసెట్ NYSE FANG+ ETF 10.02 శాతంతో దీని తర్వాతి స్థానంలో ఉంది. నాస్‌డాక్‌పై దృష్టి సారించిన పథకాలలో మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ETF, ICICI ప్రుడెన్షియల్ నాస్‌డాక్ 100 ఇండెక్స్ ఫండ్‌లకు ఒక్కొక్కదానికి దాదాపు 8.02 శాతం పెట్టుబడి పెట్టాయి.

ఈ వాటా అంతర్జాతీయ ఇండెక్స్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం కాలేదు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్‌కు 4.91 శాతం కేటాయింపు ఉండగా, ఎడెల్వీస్ టెక్నాలజీ ఫండ్‌కు 4.74 శాతం వాటా ఉంది. డీఎస్పీ వాల్యూ ఫండ్ 0.91 శాతం, యాక్సిస్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ 0.63 శాతం వాటాను కలిగి ఉన్నాయి. పెట్టుబడిదారులు కంపెనీ వాల్యుయేషన్‌ను, దాని వృద్ధి వ్యూహంపై సంభావ్య ప్రభావాలను పునఃసమీక్షిస్తున్నందున, సమీప భవిష్యత్తులో ఎన్విడియా షేర్ ధరలో అస్థిరత కొనసాగవచ్చుని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొంత మంది నిపుణులు కంపెనీలో పెట్టుబడి పెట్టేందుుక ఇదే అనుకూల సమయమని పేర్కొంటున్నారు.
విదేశాలలో పెట్టుబడి పెట్టే భారతీయ ఫండ్స్‌కు కరెన్సీ మార్పులు కూడా రూపాయి రాబడులను ప్రభావితం చేయగలవు. జెన్సన్ హువాంగ్ రాజీనామా ఎన్విడియాకు ఒక ముఖ్యమైన నాయకత్వ మార్పును సూచిస్తుంది. ప్రత్యేకించి ప్రపంచ ఏఐ (AI) పరిశ్రమలో కంపెనీని కేంద్ర స్థానంలో నిలపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications