IPO: ఆగస్ట్‎లో ఐపీఓల జాతర.. రూ.25 వేల కోట్లు సమీకరించనున్న కంపెనీలు..

వచ్చే నెల ఆగస్ట్ లో ఐపీఓల జాతర మొదలు కానుంది. 14 పైగా కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో క్విక్ కామర్స్ లీడర్ జెప్టో, ట్రూహోమ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్ ఉన్నాయి. ఈ సంస్థలు సమిష్టిగా రూ. 25,000 కోట్లకు పైగా సమీకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌లో సానుకూల మార్పును సూచిస్తోంది. వేగవంతమైన డెలివరీ సేవలకు ప్రసిద్ధి చెందిన జెప్టో ఆగస్ట్ లో అతిపెద్ద ఐపీఓగా వస్తుంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా 11.34 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 8,010 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హౌసింగ్ ఫైనాన్స్ రంగంలోని ట్రూహోమ్ ఫైనాన్స్ కూడా ఐపీఓగా రానుంది. ఆ కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

ఇందులో రూ. 1,500 కోట్ల కొత్త ఇష్యూతో పాటు అంతే మొత్తంలో ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. విద్యా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించే ఎలివేట్ క్యాంపసెస్, ఆఫర్ ఫర్ సేల్ లేకుండా కేవలం ఫ్రెష్ ఇష్యూ ద్వారానే రూ. 2,550 కోట్లు సమీకరించాలని చూస్తోంది. షిప్రోకెట్, రూ. 1,100 కోట్ల కొత్త ఇష్యూ , రూ. 1,242.35 కోట్ల OFSను కలుపుకొని, రూ. 2,342.35 కోట్ల విలువైన ఐపీఓ కోసం దరఖాస్తు చేసింది. విద్యా సాంకేతికత, అసెస్‌మెంట్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన ఇన్నోవాటివ్యూ ఇండియా మరో ముఖ్యమైన పోటీదారగా ఉంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 2,000 కోట్ల వరకు ఐపీఓను లక్ష్యంగా పెట్టుకుంది.

IPO

అలాగే పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ ఐపీఓగా రానుంది. ఐపీఓ రూ. 1,553 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతోంది. ధూత్ ట్రాన్స్‌మిషన్, ఏఆర్‌సీఐఎల్, ఆర్డీ ఇండస్ట్రీస్, గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్, రేస్ ఆఫ్ బిలీఫ్, హై-టెక్ ఇంజనీర్స్, శంకేష్ జ్యువెలర్స్, లెర్న్‌ఫ్లూయెన్స్ ఎడ్యుకేషన్‌తో సహా అనేక ఇతర సంస్థలు కూడా పబ్లిక్ లిస్టింగ్‌ల కోసం సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఇటీవల జరిగిన ఐపీఓల ప్రారంభం నేపథ్యంలో, రాబోయే ఐపీఓ సీజన్ పెట్టుబడిదారులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది.

2026లో ఇప్పటివరకు 36 భారతీయ కంపెనీలు తమ ఐపీఓలు వచ్చాయి. వాటిలో తొమ్మిది ఈ నెలలోనే వచ్చాయి. రాబోయే ముఖ్యమైన ఐపీఓలలో మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్, జూనిపర్ గ్రీన్ ఎనర్జీలవి ఉన్నాయి. మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ జూలై 29, జూనిపర్ గ్రీన్ జూలై 30న ఐపీఓగా రానున్నాయి. 2026లో వివిధ ఐపీఓల ద్వారా సుమారు 20 బిలియన్ డాలర్లను సమీకరించవచ్చని ఈక్విరస్ క్యాపిటల్‌కు చెందిన భావేష్ షా అంచనా వేశారు. అయితే, పెట్టుబడిదారులు వాల్యుయేషన్ల విషయంలో మరింత ఎంపిక చేసుకుంటున్నారని, నిధులను ఆకర్షించడానికి కంపెనీలు బలమైన అవకాశాలను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+