11 రోజుల్లో ఏడుసార్లు పెరిగిన పెట్రోల్ ధర: పన్ను వాటానే అధికం
పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెలలో (జూలై) నేటి(11వ తేదీ) వరకు ఏడుసార్లు పెరిగాయి. మే నెలలో 16 సార్లు, జూన్ నెలలో 16సార్లు పెరిగింది. ఇంధన ధరలు భారత్‌లో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. పెట్రోల్ దాదాపు ఇరవై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సెంచరీ దాటగా, డీజిల్ ధర కూడా పలుచోట్ల రూ.100 దాటింది. నిన్న శనివారం పెరుగుదలతో మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 38సార్లు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101కి సమీపంలో ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.95, డీజిల్ రూ.89.92గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.97, లీటర్ డీజిల్ రూ.97.5గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.05, డీజిల్ రూ.93.01, చెన్నైలో పెట్రోల్ రూ.101.71, డీజిల్ రూ.94.43గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్నాటక, జమ్ము అండ్ కాశ్మీర్, ఒడిశా, లడక్, తమళనాడు, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, బీహార్, ఢిల్లీ, కేరళల, పుదుచ్చేరి, సిక్కిం రాష్ట్రాల్లో పెట్రోల్ రూ.100 దాటింది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో అత్యధికం పన్నులే. కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటా 60 శాతం ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోల్ రూ.101 ఉంది. ఇందులో రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీ, రూ.22.80 రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ ఉంటుంది. డీజిల్ ధరలో రూ.31.80 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.13.04 స్టేట్ వ్యాట్ ఉంది.


Click it and Unblock the Notifications