కరోనా మెడిసిన్ ధరను తగ్గించిన 7 ఫార్మా కంపెనీలు: రూ.899కే Remdesivir
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో దేశ తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్స్ ధరలు కూడా పెరిగాయి. ఇంకోవైపు బ్లాక్ మార్కెట్ పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్ కొరత ఏర్పడగా బయట మార్కెట్లో దీనిని అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీంతో ధరలు తగ్గించాలని ప్రభుత్వం, నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NAPPA) ఫార్మా కంపెనీలకు సూచించాయి. ఇందుకు కంపెనీలు అంగీకరించాయి.
ఏడు ఫార్మా కంపెనీలు రెమ్‌డెసివిర్ ధరను తగ్గించాయి. క్యాడిల్లా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా బ్రాండ్స్, సీఎన్జీఎన్, మైలాన్, జూబ్లియంట్ జెనరిక్స్, హెటిరో హెల్త్ కేర్ తదితర కంపెనీలు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

క్యాడిల్లా హెల్త్ కేర్ రేమ్‌డ్యాక్ ధర రూ.2800 కాగా రూ.899కి, సీఎన్జీన్ ఇంటర్నేషనల్ రెమ్‌విన్ రూ.3950 నుండి రూ.2450కి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రెడిక్స్ రూ.5400 నుండి రూ.2700, మైలాన్ రూ.4800 నుండి రూ.3400కు, జూబ్లియంట్ జనరిక్స్ రూ.4700 నుండి రూ.3400, హెటిరో హెల్త్ కేర్ కొవిఫర్ రూ.5400 నుండి రూ.3450, సిప్లా సిప్రిమి రూ.4000 రూ.3000కి తగ్గించాయి.


Click it and Unblock the Notifications