టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.75,845 కోట్లు జంప్
టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం ఎగిసింది. ఈ కంపెనీల ఎం-క్యాప్ గతవారం రూ.75,845.46 కోట్లు పెరిగింది. HDFC బ్యాంకు, HDFCల మార్కెట్ క్యాప్ భారీగా ఎగిసింది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభపడ్డ కంపెనీల్లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్ సంస్థల ఎం-క్యాప్ క్షీణించింది.

మార్కెట్ క్యాప్ జంప్
HDFC మార్కెట్ క్యాప్ రూ.20,857.99 కోట్లు పెరిగి రూ.4,62,586.41 కోట్లకు పెరిగింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజషన్ రూ.15,393.9 కోట్లు క్షీణించి రూ.7,84,758.50 కోట్లకు చేరింది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,251.38 కోట్లు పెరిగి రూ.5,36,878.45 కోట్లకు చేరుకుంది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.9,609.3 కోట్లు ఎగిసి రూ.3,64,199.40 కోట్లకు చేరుకుంది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.7,410.96 కోట్లు పెరిగి రూ.10,98,773.29 కోట్లకు చేరింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.6,500.94 కోట్లు ఎగిసి రూ.3,94,914.98 కోట్లకు చేరింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.5,820.99 కోట్లు పెరిగి రూ.3,18,181.18 కోట్లుగా నమోదయింది.

ఈ సంస్థల ఎం-క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ రూ.4,279.13 కోట్లు తగ్గి రూ.12,59,741.96 కోట్లకు పరిమితమైంది.
హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.2,948.69 కోట్లు తగ్గి రూ.5,60,933.06 కోట్లుగా నమోదయింది.
భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.1,063.83 కోట్లు పెరిగి రూ.2,81,015.76 కోట్లకు చేరింది.

టాప్ 10 కంపెనీలు ఇవే..
టాప్ 10 కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ భారీగా ఎగిసింది. టాప్ టెన్ కంపెనీలు వరుసగా RIL, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. కాగా గతవారం సెన్సెక్స్ 895.44 పాయింట్లు లేదా 1.90 శాతం ఎగిసింది.


Click it and Unblock the Notifications