ముంబై: టాప్ టెన్‌లోని 7 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1 లక్ష కోట్లకు పైగా క్షీణించింది. కేవలం టాటా కన్సల్టెన్సీ, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC బ్యాంకుల మార్కెట్ క్యాప్ పెరిగింది. మిగతా సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. అంతకుముందు వారం టాప్ టెన్‌లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,38,976.88 కోట్లు క్షీణించగా, దానికంటే ముందు వారం కూడా మాత్రం రూ.72,442 కోట్లు పెరిగింది. గత వారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 849.74 పాయింట్లు లేదా 1.70 శాతం పెరిగింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.55,565.21 కోట్లు క్షీణించి రూ.12,64,243.20 కోట్లకు తగ్గింది.
బజాజ్ ఫైనాన్స్ రూ.16,197.55 కోట్లు తగ్గి రూ.3,12,327.04 కోట్లు తగ్గింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్కెట్ క్యాప్ రూ.12,494.45 కోట్లు క్షీణించి రూ.3,18,697.88 కోట్లు తగ్గింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.11,681.66 కోట్లు పడిపోయి రూ.3,51,272.18 కోట్లకు తగ్గింది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,467.63 కోట్లు క్షీణించి రూ.4,00,093.61 కోట్లకు తగ్గింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,751.92 కోట్లు క్షీణించి రూ.5,69,352.11 కోట్లకు తగ్గింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.2,408.22 కోట్లు క్షీణించి రూ.8,22,616.51 కోట్లకు తగ్గింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ.1,812.54 కోట్లు పెరిగి రూ.11,34,924.45 కోట్లకు పెరిగింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.364.19 కోట్లు తగ్గి రూ.5,43,924.22 కోట్లకు పెరిగింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.62.77 ఎగిసి రూ.4,56,741.20 కోట్లకు ఎగిసింది.

టాప్ టెన్ కంపెనీలు వరుసగా...
10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, SBI, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications