ముంబై: టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో ఏడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా తగ్గింది. హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు ఎక్కువగా నష్టపోయాయి. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ పెరిగింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది
- హెచ్యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.14,320.54 కోట్లు తగ్గి రూ.4,93,007.39 కోట్లుగా ఉంది.
- HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.11,611.6 కోట్లు క్షీణించి రూ.5,81,900.65కు పడిపోయింది.
- కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.10,205.11 కోట్లు తగ్గి రూ.2,53,002.13కు తగ్గింది.
- రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.9,027.32 కోట్లు క్షీణించి రూ.15,58,987.77 కోట్లుగా ఉంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,144.93 కోట్లు తగ్గి రూ.3,09,076.75 కోట్లకు పడిపోయింది.
- ఐటీసీ మార్కెట్ వ్యాల్యూ రూ.5,783.23 కోట్లు క్షీణించి రూ.2,20,500.76 కోట్లుగా ఉంది.

టీసీఎస్, ఇన్ఫీ, ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ జంప్
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ.28,912.12 పెరిగి రూ.9,19,615.68 కోట్లుగా ఉంది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్ దాటిన రెండో కంపెనీ టీసీఎస్.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,342.45 కోట్లు పెరిగి రూ.4,27,025.67 కోట్లుగా ఉంది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,755.05 కోట్లు పెరిగి రూ.2,70,977.53 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు..
టాప్ 10 కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ రూ.15 లక్షల కోట్లు దాటి మొదటి స్థానంలో ఉంది. టీసీఎస్ రూ.9 లక్షల కోట్లు దాటి రెండో స్థానంలో ఉంది. HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్టెల్, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐటీసీ ఉన్నాయి.
గత వారం సెన్సెక్స్ 8 పాయింట్లు లేదా 00.2 శాతం క్షీణించింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications