టాప్ 10 సంస్థల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,31,173.41 కోట్లు క్షీణించింది. టీసీఎస్, HUL టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, HDFC, బజాజ్ ఫైనాన్స్, విప్రో కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. అదే సమయంలో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. అంతకుముందువారం కూడా టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,60,408.24 కోట్లు పెరిగింది. దానికంటే ముందు వారం రూ.2,22,591.01 కోట్లు పెరిగింది. వరుసగా మూడు వారాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎగిసింది. ఈ మూడు వారాల్లో టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
- హిందూస్తాన్ యూనీలీవర్(HUL) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,234.21 కోట్లు పెరిగి రూ.6,15,016.63 కోట్లకు చేరుకుంది.

- టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,344.44 కోట్లు పెరిగి రూ.13,15,919.03 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,442.29 కోట్లు పెరిగి రూ.4,01,782.58 కోట్లకు చేరుకుంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,335.27 కోట్లు పెరిగి రూ.7,34,755.12 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,512.87 కోట్లు పెరిగి రూ.4,91,729.99 కోట్లకు చేరుకుంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.919.22 కోట్లు పెరిగి రూ.13,60,571.28 కోట్లకు చేరుకుంది.
- అదే సమయంలో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,776.05 కోట్లు క్షీణించి రూ.3,63,187.07 కోట్లకు తగ్గింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,854.73 కోట్లు క్షీణించి రూ.4,71,497.28 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,947.03 కోట్లు తగ్గి రూ.8,37,756.50 కోట్లకు క్షీణించింది.
- టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. గత వారం సెన్సెక్స్ 107.97 పాయింట్లు లేదా 0.19 శాతం లాభపడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications