Multibagger Stock: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు లాభాలను అందిస్తుంటాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్. వార్తల్లో ఎక్కువగా ఫోకస్ కాని స్టాక్స్ తమ లాభాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
ఇప్పటి వరకు మనం మట్లాడుకున్నది స్మాల్ క్యాప్ కంపెనీ అయిన సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ కంపెనీ షేర్ల గురించే. ఇది గడచిన రెండేళ్ల కాలంలో తనను నమ్మి డబ్బు పెట్టిన ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను అందించింది. ఈ క్రమంలో దాదాపు 1000 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చింది. ఎనర్జీ సొల్యూషన్స్ అందించే వ్యాపారంలో కంపెనీ ఉంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచే కంపెనీ షేర్లు దాదాపు 80 శాతం లాభపడ్డాయి. ప్రస్తుతం దీనిని చూస్తుంటే వరుసగా మూడో ఏడాది కూడా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ సెప్టెంబర్ 03, 2021న తొలిసారి బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభఇంచింది. అప్పట్లో ఈ కంపెనీ షేర్ల ధర కేవలం రూ.5 మాత్రమే. కానీ ఈరోజు స్టాక్ ధరను గమనిస్తే మార్కెట్లో 5 శాతం లాభపడి రూ.61.10 వద్ద ఉంది.
ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.650 కోట్లుగా ఉంది. పైగా స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠ ధరను నమోదు చేసింది. గడచిన 20 నెలల్లో స్టాక్ ఏకంగా 1,054.76 శాతం లాభపడింది. అంటే సెప్టెంబర్ 3, 2021న ఒక ఇన్వెస్టర్ సర్వోటెక్ పవర్ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పెట్టుబడి విలువ రూ.12.22 లక్షలకు చేరుకుని ఉండేది.

సోలార్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్‌ల తయారీతో పాటు కంపెనీ ఇన్వర్టర్లు, యూపీఎస్ తయారీకి ప్రసిద్ధి చెందింది. అలాగే దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ వైద్య పరికరాల తయారీలోనూ ఉంది. కంపెనీ ఆదాయం మార్చి త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 125.8% పెరిగి రూ.51.06 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం 134 శాతం పెరిగి రూ.119.98 కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications