Trending Stock: బీపీసీఎల్ నుంచి భారీ ఆర్డర్.. అప్పర్ సర్క్యూట్ తాకిన స్టాక్..
Trending Stock: మార్కెట్లలో కొంత ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటికీ వార్తల్లో నిలుస్తున్న షేర్లు మాత్రం తమపని తాము చేసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఒక ఈవీ స్టాక్ దూసుకుపోతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. కంపెనీకి బీపీసీఎల్ నుంచి ఆర్డర్ వచ్చిందనే శుభవార్త మార్కెట్లోకి రావటంతో షేర్లు తుఫాను వేగాన్ని అందుకున్నాయి. ఏకంగా ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.79.10 రేటుకు చేరుకున్నాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ కోసం సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ ఆర్డర్ అందుకుంది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. బీపీసీఎల్ నుంచి మెుత్తం 2,649 AC EV ఛార్జర్ల కోసం ఆర్డర్‌ను అందుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆర్డర్ విలువ ఎంత అనే వివరాలను మాత్రం కంపెనీ ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా వ్యూహాత్మకంగా EV ఛార్జర్ల తయారీ, సరఫరా, ఇన్‌స్టాలేషన్‌కు కంపెనీ బాధ్యత వహిస్తోంది.
BPCL ఈ-డ్రైవ్ ప్రాజెక్ట్ కింద ప్రధాన భారతీయ నగరాల్లో పెట్రోల్ పంపులను సన్నద్ధం చేస్తోంది. EV ఛార్జింగ్ సొల్యూషన్‌లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం EV ఛార్జర్‌ల పరిధిలో 3kW, 7kW ఉన్నాయి. ఏసీ ఛార్జర్ల తయారీ, ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభం కాగా.. డిసెంబర్ 15 నుంచి చార్జర్ల సరఫరా ప్రారంభం కానుంది. తాజా డీల్ ప్రకారం ఆర్డర్ డెలివరీ మూడు నెలల వ్యవధిలో పూర్తవుతుందని సమాచారం.
సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో సర్వోటెక్ లాభం ఏడాది ప్రాతిపదికన 300 శాతం పెరిగి రూ. 3.12 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 114 శాతం పెరిగి రూ.85.93 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications