Serum Institute: కరోనా విజృంభణ వేళ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో కాలం వెళ్లదీశారు. చికిత్స లేని వైరస్ స్వైర విహారం చేస్తున్న సమయంలో నేనున్నానంటూ దేశీయ సీరమ్ ఇనిస్టిట్యూట్ టీకాతో ముందుకొచ్చింది. దీంతో దాని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది.
కొవీషీల్డ్ టీకా తయారీదారు సీరమ్ ఇనిస్టిట్యూట్ CEO అదార్ పూనావాలా తాజాగా వార్తలకెక్కారు. లండన్ లోని మేఫెయిర్ వద్ద అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో దీని విలువ 1,446 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

హైడ్ పార్క్ సమీపంలోని వందేళ్ల నాటి అబెర్‌కాన్‌వే హౌస్ కొనుగోలుతో.. ఈ డీల్ లండన్‌లోని రెండో అత్యంత ఖరీదైన లావాదేవీగా నిలిచింది. గతంలో 2-8a రట్‌ల్యాండ్ గేట్ ను సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ 210 మిలియన్ యూరోలను వెచ్చించి కొనుగోలు చేశారు. దాని తరువాత తాజా కొనుగోలే అతిపెద్దదని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఈ కొనుగోలుకు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే పోలాండ్ సంపన్నుడు, దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్ జిక్ కమార్తె డొమినికా కుల్ జిక్ ఇంటిని విక్రయించినట్లు టైమ్స్ నివేదిక పేర్కొంది. దీనిని ఆ సంస్థ UK విభాగం సీరం లైఫ్ సైన్సెస్ కొనుగోలు చేసినట్లు తెలిపింది.
లండన్ రియల్ ఎస్టేట్‌లో భారతీయులు భారీ కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత జూలైలో ఎస్సార్ గ్రూపు సహ యజమాని రవి రుయా హనోవర్ లాడ్జ్‌ను 113 మిలియన్ యూరోలకు కొనుగోలు చేశారు. 2021లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ బకింగ్‌హామ్ షైర్‌లో స్టోక్ పార్క్‌ను 57 మిలియన్ యూరోలకు సొంతం చేసుకుంది. 2014లో హిందూజా ఫ్యామిలీ కూడా 5.8 మిలియన్ యూరోలతో ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications