Stock Market: సెప్టెంబర్ మాసంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా అస్థిరతకు లోనయ్యాయి. ఎక్కువగా స్మాల్, మిడ్ క్యాప్ సూచీల్లో ప్రభావం ఎక్కువగా కనిపించింది. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంత స్థిరంగానే కొనసాగాయి.
విదేశీ పెట్టుబడిదారులతో పాటు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ తమ ఈక్విటీ పెట్టుబడులను విక్రయించటంతో మార్కెట్లలో ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలో ఫార్మా, టెలికాం, ప్రభుత్వ బ్యాంకులు, సీపీఎస్ఈ సూచీలు మినహా మిగిలిన నిఫ్టీ ఇండిసెస్ సెప్టెంబర్ మాసంలో నష్టాలను నమోదు చేశాయి. అధిక ద్రవ్యోల్బణం, క్రూడ్ ధరల పెరుగుదల, స్థిరమైన అధిక-వడ్డీ రేట్ల అంచున ఉన్న మందగమన ఆర్థిక వ్యవస్థ కారణంగా ప్రపంచ మార్కెట్ పోరాడుతోంది.

అటు పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి ఇటు గృహ వినియోగదారుల వరకు అందరూ ఖర్చులను తగ్గించుకుంటున్నందున రానున్న కాలంలో వృద్ధిపై నీలినీడలు అలుముకున్నాయి. అలాగే ఎక్కువ మంది బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండటంతో ఈక్విటీల నుంచి తమ పెట్టుబడులను తరలించటం మరో కారణంగా కనిపిస్తోంది. ఈ ధోరణి భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో గణనీయమైన అమ్మకానికి దారితీసింది. అందువల్ల సెప్టెంబరు నెలలో జపాన్, తైవాన్, చైనా, యూరో జోన్ వంటి దేశాల్లో గరిష్ఠంగా అమ్మకాలు నమోదయ్యాయి.
అలాగే మార్కెట్లలో ఎస్ఎమ్ఈ ఐపీవోల కోలాహలం కూడా కొనసాగుతోంది. 2023లో మొత్తం 135 SMEలు దేశీయ స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టి రూ.3,650 కోట్ల నిధులను సమీకరించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న విదేశీ మదుపరుల అమ్మకాల జోరు, దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల మందగమనం స్వల్పకాలికమైనదిగా బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొంత కాలం దీని ప్రతికూల ప్రభావం మార్కెట్లలో కనిపిస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్త నెల దేశీయ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ మార్కెట్ల పనితీరును నిశితంగా పరిశీలించవలసి ఉంటుందని తెలుస్తోంది. అలాగే రిజర్వు బ్యాంక్ సైతం ఈనెల సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చని వెల్లడైంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications