700 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్, 52 వారాల గరిష్టానికి రిలయన్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు (ఏప్రిల్ 21) ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా ఐదు రోజుల నష్టాల అనంతరం నిన్న, లాభాల్లో ముగిశాయి సూచీలు. నేడు అదే ఒరవడి కొనసాగుతోంది. ఉదయం 300 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం గం.12.20 సమయానికి ఏకంగా 700 పాయింట్లకు పైగా లాభాల్లోకి వచ్చింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంతకంతకూ పెరిగాయి.

సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్
సెన్సెక్స్ ఉదయం 57,458 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,801 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,311 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ వారం ఓ సమయంలో 56,500 స్థాయికి పడిపోయిన, సెన్సెక్స్ ఇప్పుడు 57,740 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం గం.12.21 సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్లు ఎగిసి 57,738 పాయింట్ల వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 17,331 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
ఐటీ, ఆటో స్టాక్స్ ఎగిసిపడ్డాయి. మధ్యాహ్నం గం.12.20 సమయానికి బీఎస్ఈ ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, స్మాల్ క్యాప్ 1 శాతం నుండి 2 శాతం వరకు లాభపడ్డాయి. కేవలం బీఎస్ఈ మెటల్స్ మాత్రమే అర శాతం నష్టాల్లో ఉంది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఇన్ఫ్రా, నిఫ్టీ ఐటీ కూడా 1 శాతం నుండి 2 శాతం మేర లాభపడగా, నిఫ్టీ మెటల్ 0.36 శాతం క్షీణించింది.
నేడు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్, క్రిసిల్, సెయింట్, ర్యాలీస్ ఇండియా, శివ సిమెంట్ ఫలితాలు నేడు ఉన్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ గెయినర్స్ స్టాక్స్‌లో కోల్ ఇండియా, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఈ ఐదు స్టాక్స్ కూడా 2 శాతం నుండి 3 శాతం మధ్య లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, సిప్లా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. రిలయన్స్ 52 వారాల గరిష్టాన్ని తాకింది.


Click it and Unblock the Notifications