సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 17,400 పాయింట్లకు పైన

బడ్జెట్ సమయంలోని భారీ లాభాల నేపథ్యంలో ఆ తర్వాత కనిపించిన ప్రాఫిట్ బుకింగ్‌కు నిన్నటితో చెక్ పడింది. నిన్న తీవ్ర ఊగిసలాటలో కొనసాగి, చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు నేడు మాత్రం భారీ లాభాల్లో కనిపిస్తున్నాయి. వరుసగా ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో సూచీలు మళ్లీ పైకి కదులుతున్నాయి. నేడు సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడింది.

అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలు, క్రితం సెషన్లో అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం, రేపు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం నిర్ణయాలు సానుకూలంగా ఉండవచ్చుననే తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఇక, అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి 74.69 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 74.74 వద్ద ముగిసింది.

అదానీ విల్మర్ జంప్

అదానీ విల్మర్ జంప్

అదానీ విల్మర్ షేర్ నేడు 19 శాతం లాభపడింది. అదానీ విల్మర్ లిస్టింగ్ అనంతరం పరుగు పెడుతోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.40,614 కోట్లకు చేరుకుంది. 26.31 లక్షల షేర్లు చేతులు మారాయి. వీటి వ్యాల్యూ రూ.76.98 కోట్లు. అదానీ విల్మర్ లిమిటెడ్ స్టాక్ మధ్యాహ్నం గం.11 సమయానికి 16.20 శాతం ఎగిసి రూ.311.70 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ కనిష్టం రూ.227, గరిష్టం రూ.317.

ఐటీ, ఐఆర్‌సీటీసీ జూమ్

ఐటీ, ఐఆర్‌సీటీసీ జూమ్

రంగాలవారీగా చూస్తే పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోయింది. ఐటీ ఇండెక్స్ ఒక శాతం లాభపడింది. 2022 క్యాలెండర్ ఏడాదిలో 10 శాతం క్షీణించిన ఐటీ ఇండెక్స్ నేడు సానుకూలంగా ఉంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే హెవీ వెయిట్స్ రిలయన్స్, టీసీఎస్ వంటివి పరుగు పెడుతుండటం కలిసి వచ్చింది. ఐఆర్‌సీటీసీ కూడా భారీగా లాభపడుతోంది. మూడో త్రైమాసికంలో ఫలితాలు బలంగా ఊండటంతో ఐఆర్‌సీటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హిండాల్కో, బజాజ్ ఆటో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్, HDFC లైఫ్, ఐవోసీ ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎక్కువ శాతం లాభాల్లో ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+