ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 1) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు(1.65 శాతం) లాభపడి 38,697.05, నిఫ్టీ 169 పాయింట్ల (1.51 శాతం) లాభపడి 11,416.95 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం ఎగిసింది. స్మాల్ క్యాప్ 0.69 శాతం లాభపడింది. బీఎస్ఈ బ్యాంకెక్స్ ఇండెక్స్ 4 శాతానికి పైగా, ఫైనాన్స్ 3 శాతానికి పైగా లాభపడింది. ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాలు భారీ లాభాల్లో ముగిశాయి. జీఎస్టీ కలెక్షన్లు కూడా పెరిగాయి. ఆటో మొబైల్ సేల్స్ పెరగడంతో ఆటో రంగం కూడా పుంజుకుంది.

మార్కెట్ జూమ్‌కు కారణాలు
స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడింది. కరోనా రికవరీ రేటు పెరగడం కలిసి వచ్చింది. అయితే మార్కెట్ భారీ ర్యాలీకు ముఖ్యమైన కారణం అన్‌లాక్ 5.0. మరో పదిహేను రోజుల్లో థియేటర్లు, మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ కానున్నాయి. కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు కరోనా పరిస్థితులకు ప్రజలు రోజురోజుకు అలవాటు పడటం, ఆటో సేల్స్ పెరగడం, అమెరికా మరో భారీ ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా మార్కెట్ లాభపడటానికి కారణమయ్యాయి.

భారీ లాభాలు
అక్టోబర్ నెలలో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా ఎగిసిపడటంతో నిఫ్టీ మంచి లాభాలు చూసింది.
- గత మూడు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఓ వారంలో మొదటిసారి భారీ లాభాలను నమోదు చేశాయి. రెండు సూచీలు కూడా 3 శాతం చొప్పున లాభపడ్డాయి.
- నిఫ్టీ బ్యాంకు నాలుగు వారాల నష్టాన్ని పూడ్చింది. ఈ వారం 6 శాతం మేర ఎగిశాయి.
- అన్ని రంగాలు కూడా ఈ వారం మంచి లాభాల్లో ముగిశాయి. ఎక్కువగా లాభపడింది బ్యాంకింగ్ రంగం.
- సెన్సెక్స్, నిఫ్టీ రెండు వారాల గరిష్టాన్ని తాకింది.
- నిఫ్టీ బ్యాంకు 794 పాయింట్లు లాభపడగా, మిడ్ క్యాప్ సూచీ 142 పాయింట్లు లాభపడింది.
- 39 నిఫ్టీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఐదింట 4 ఫైనాన్షియల్స్ లాభాల్లో ముగిశాయి.
- ఆటో సేల్స్ పెరగడంతో ఈ రంగం పుంజుకుంది. బజాజ్ ఆటో ఏకంగా 4 శాతం లాభపడింది.
- మల్టీప్లెక్స్ స్టాక్స్ లాభపడ్డాయి. పీవీఆర్ 7 శాతం లాభపడింది.
- సిటీ గ్యాస్ కంపెనీ స్టాక్స్ పెరిగాయి. మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్త గ్యాస్ స్టాక్స్ 4 శాతం చొప్పున పెరిగాయి.
- లిస్టింగ్ లాభాలను కెమ్‌కాన్ నిలబెట్టుకోలేకపోయింది. 20 శాతం క్షీణించి రూ.731 వద్ద క్లోజ్ అయింది.
- కామ్స్ రూ.1402 వద్ద క్లోజ్ అయింది. లిస్టింగ్ ధర రూ.1518 కాగా, 8 శాతం నష్టంతో ముగిసింది.

బ్యాంకింగ్ అదుర్స్
- టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్ర ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిండాల్కో, ఐటీసీ, రిలయన్స్, ఎన్టీపీసీ ఉన్నాయి.
- బ్యాంకింగ్ స్టాక్స్ కౌంటర్లు కొనుగోళ్లతో కిక్కిరాశాయి.
- ఐటీ స్టాక్స్ మంచి లాభాలు నమోదు చేశాయి. అన్ని స్టాక్స్ కూడా దాదాపు 4 శాతం వరకు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ దూసుకెళ్లాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications