ముంబై: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, జూన్ 16) కోలుకున్నాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 716.48 పాయింట్లు లేదా 2.16% పెరిగి 33,945.28 వద్ద, నిఫ్టీ 211.10 పాయింట్లు లేదా 2.15% ఎగిసి 10,024.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 856 షేర్లు లాభాల్లో, 114 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 25 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత సెన్సెక్స్ 780 పాయింట్లకు పైగా ఎగిసింది. మధ్యాహ్నం గం.11.41 సమయానికి సెన్సెక్స్ 531 పాయింట్లు లాభంతో ఉంది. రూపాయి 16 పైసలు లాభపడి 75.87 వద్ద ప్రారంభమైంది. సోమవారం ఇది 76.03 వద్ద క్లోజ్ అయింది. అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.

టాప్ గెయిర్స్.. టాప్ లూజర్స్
మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, యూపీఎల్, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, గెయిల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రెటెల్ ఉన్నాయి. టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో భారీ నష్టాలు నమోదు చేయడంతో టాటా మోటార్స్ నష్టపోయింది.

అమెరికా ఫెడ్ రిజర్వ్ కార్పోరేట్ బాండ్స్
నిన్న భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు నేడు అంతే భారీగా కోలుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కార్పోరేట్ బాండ్స్ కొనుగోలు కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది అక్కడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో భారత మార్కెట్ సెంటిమెంట్ కూడా బలపడింది. డౌజోన్స్ 0.62 శాతం, ఎస్ అండ్ పీ 500 కూడా 0.98 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 1.43 శాతం లాభాలు నమోదు చేసాయి.

చైనాలో కరోనా తగ్గుదల
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరమని హెచ్చరికలు తెలిసిందే. చైనాలో ఈ వైరస్ రెండోసారి విజృంభించింది. అయితే అది కాస్త తగ్గుముఖం పట్టింది. బీజింగ్‌లో కొత్తగా 27 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు ఇవి 36 నమోదయ్యాయి. దీంతో రెండోసారి విజృంభన ప్రభావం అంతగా లేదనే అంశం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

రెండు నెలల గరిష్టానికి స్టాక్స్
అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లోకి వచ్చాయి. జపాన్ షేర్లు 2.2 శాతం పెరిగాయి. జూన్ 1వ తేదీ తర్వాత ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా స్టాక్స్ ఏకంగా 3 శాతం పెరిగాయి. చైనా స్టాక్స్ 1.2 శాతం ఎగిశాయి. జపాన్ నిక్కీ సూచీ, సొత్ కొరియా సూచీ గత రెండు నెలల్లో అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం భారత మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications