వరుసగా ఐదు రోజుల నష్టం అనంతరం స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. గత రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. నేడు మాత్రం మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను నష్టపోలేదు. ఇటీవల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఆటో, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు రాణించడం మార్కెట్‌కు కలిసి వచ్చింది.
అలాగే, దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకుల ఏర్పాటుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లలో సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపించాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 76.22 వద్ద ట్రేడ్ అయింది. ఇన్వెస్టర్ల సంపద నేడు రూ.2.5 లక్షల కోట్లు పెరిగింది.

సెన్సెక్స్ 56,741 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,216 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,521 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 574 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 57,037 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 177.90 పాయింట్లు లేదా 1.05 శాతం లాభపడి 17,136.55 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రా టెక్ సిమెంట్స్, మారుతీ, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, HDFC, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications