ముంబై:స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 14) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 289.04 పాయింట్లు లేదా 0.74శాతం ఎగిసి 39,143.59 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78.50 పాయింట్లు లేదా 0.68శాతం లాభపడి 11,543 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగిసిపడింది. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ కారణంగా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.
టాప్ 10 కంపెనీల్లో గతవారం నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3 లక్షల కోట్లు పెరగగా, ఇందులో రిలయన్స్ వాటానే రూ.2.50 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ వారం కూడా రిలయన్స్ షేర్ ధర ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. ిక రూపాయి 14 పైసలు బలపడి, ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో (సెప్టెంబర్ 11) 73.53 వద్ద క్లోజ్ కాగా, ఈరోజు 73.39 వద్ద ప్రారంభమైంది.

3 శాతం నుండి 10 శాతం ఎగిసిన ఐటీ షేర్లు
ఈ రోజు అన్ని రంగాలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్‌లో ఐటీ, బ్యాంకింగ్ రంగాలు ఒక శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ షేర్ ధరలు ఈ రోజు ఏకంగా 4 శాతం ఎగిశాయి. కంపెనీ గైడ్‌విజన్ అక్వైర్ చేసుకునే అంశంపై క్లారిటీ రావడంతో షేర్లు ఎగిసిపడ్డాయి. టీసీఎస్ షేర్లు కూడా 3 శాతం ఎగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ షేర్ 10 శాతం, విప్రో షేర్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి.

యస్ బ్యాంకు-ఐసీఐసీఐ టయ్-అప్
టాప్ గెయినర్స్ జాబితా విషయానికి వస్తే హెచ్‌సీఎల్ టెక్ 10 శాతంతో ముందు ఉన్నది. ఆ తర్వాత ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్ ఉన్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ షేర్లు 3 శాతం, యస్ బ్యాంకు షేర్లు 5 శాతం ఎగిశాయి. యస్ బ్యాంకుతో టయ్-అప్ చేసుకుంటున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రకటించింది. దీంతో ఈ రెండింటి షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్ షేర్లు 3 శాతం ఎగిశాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ జూలై, ఆగస్ట్ నెలల్లో పెరిగాయి. దీంతో టాటా మోటార్స్ షేర్ ధర పెరిగింది. రిలయన్స్ షేర్ ధర 1 శాతం పెరిగింది.

అందుకే లాభాల్లో..
గత వారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.53 శాతం, డౌజోన్స్ 0.48 శాతం లాభపడ్డాయి. కేవలం నాస్‌డాక్ మాత్రమే స్వల్పంగా 0.6 శాతం నష్టపోయింది. బ్రిటన్ ఎఫ్‌టీఎస్ఈ 0.48 శాతంతో పాటు ఇటలీ, స్విస్-జ్యూరిచ్, ఆస్ట్రేలియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు చైనా, మార్కెట్లు దాదాపు 0.79 శాతం, జపాన్ నిక్కీ 0.65 శాతం లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్ ట్రయల్స్ తిరిగి ప్రారంభం కావడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications