సెన్సెక్స్ 300 పాయింట్లు అప్, రూ.2000 క్రాస్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(నవంబర్ 6) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్న మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు అదే ఒరవడి కొనసాగించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 62.39 పాయింట్లు (0.15%) లాభపడి 41,402.55 వద్ద, నిఫ్టీ 17.70 పాయింట్లు (0.15%) లాభపడి 12,138 పాయింట్ల వద్ద ముగిసింది.

మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 306 పాయింట్లు లాభపడి 41,646 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 41,659ని తాకింది.588 షేర్లు లాభాల్లో, 299 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 46 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్ వంటి రంగాలు లాభాల్లో ఉండగా, ఐటీ, ఎఫ్ఎసీజీ రంగాలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఎనర్జీ ఒక శాతానికి పైగా ఎగిసింది. ఫార్మా ఒత్తిడిలో ఉంది.

రూ.2,000 క్రాస్ చేసిన రిలయన్స్

రూ.2,000 క్రాస్ చేసిన రిలయన్స్

గతవారం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ స్టాక్స్ ఈ వారం మొదటి రెండు సెషన్లలో కుప్పకూలిన విషయం తెలిసిందే. స్టాక్ ఏకంగా రూ.1900 దిగువకు వచ్చింది. అయితే మూడు రోజులుగా కుదురుకుంటోంది. రిలయన్స్ అనుబంధ సంస్ధ రిలయన్స్ వెంచర్స్‌లోకి సౌదీ పెట్టుబడులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ స్టాక్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి 3 శాతానికి పైగా లాభపడి రూ.2,017 వద్ద ట్రేడ్ అయింది. ఐదో సెషన్‌లో రూ.2వేల మార్క్‌ను దాటింది. ఇటీవల రిలయన్స్ స్టాక్ పతనం నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13 లక్షల కోట్ల దిగువకు చేరుకున్న విషయం తెలిసిందే.

నిఫ్టీ బ్యాంకు లాభాల్లో.. ఐటీ నష్టాల్లో

నిఫ్టీ బ్యాంకు లాభాల్లో.. ఐటీ నష్టాల్లో

నిఫ్టీ ఆటో 0.09 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.46 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.89 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.73 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.42 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.78 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.78 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.15 శాతం, నిఫ్టీ ఐటీ 0.16 శాతం, నిఫ్టీ మీడియా 0.33 శాతం, నిఫ్టీ మెటల్ 0.06 శాతం, నిఫ్టీ ఫార్మా 0.48 శాతం నష్టపోయాయి.

ఈ వారం ప్రారంభంలో భారీగా నష్టపోయిన రిలయన్స్ నేడు టాప్ గెయినర్స్ జాబితాలో ముందుంది. రిలయన్స్ తర్వాత బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యూపీఎల్ ఉన్నాయ.

టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే, మారుతీ సుజుకీ, గెయిల్, ఏషియన్ పేయింట్స్, కోల్ ఇండియా ఉన్నాయి.

ఒత్తిడిలో ఐటీ స్టాక్స్

ఒత్తిడిలో ఐటీ స్టాక్స్

ఐటీ రంగం ఒత్తిడిలో ఉంది. అయితే టీసీఎస్ 0.55 శాతం, టెక్ మహీంద్ర 0.39 శాతం, కోఫోర్జ్ 0.84 శాతం లాభపడ్డాయి.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 0.52 శాతం, ఇన్ఫోసిస్ స్టాక్ 0.67 శాతం, విప్రో 0.38 శాతం, మైండ్ ట్రీ 1.07 శాతం నష్టపోయాయి.

సెన్సెక్స్ 42,500 దాటింది. నిఫ్టీ 12,200ను క్రాస్ చేసింది.

డాలర్ మారకంతో రూపాయి 39 పైసలు లాభపడి 73.99 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 74.38 వద్ద ముగిసింది.

ఇండియా సిమెంట్స్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. స్టాండలోన్ నిరక లాభం రూ.71. కోట్లుగా ఉంది. ఆదాయం 14.1 శాతం క్షీణించి రూ.1,069.7 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,246 కోట్లుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+