సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్, 15,800 పాయింట్లకు పైన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 30) లాభాల్లో ప్రారంభమై, భారీ లాభాల్లోకి వెళ్లాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీగా నష్టపోయిన సూచీలు, నేడు ఏ దశలోను క్షీణించలేదు. మధ్యాహ్నం ఓ సమయంలో కాస్త క్షీణించినట్లు కనిపించినప్పటికీ, అంతలోనే మళ్లీ పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ 75 పాయింట్ల వరకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.

లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ 53,000 పాయింట్ల దిశగా పరుగులు పెడుతోంది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ 294.48 (0.56%) పాయింట్లు ఎగిసి 52,808.12 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 73.75 (0.47%) పాయింట్లు ఎగిసి 15,822 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,651.09 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,875.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,630.91 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,776.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,839.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,774.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 1.73 శాతం, ఇన్ఫోసిస్ 1.47 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.44 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.40 శాతం, టాటా స్టీల్ 1.10 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 1.25 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.93 శాతం, HUL 0.69 శాతం, హీరో మోటో కార్ప్ 0.60 శాతం, HDFC 0.48 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సిప్లా ఉన్నాయి.

రంగాలవారీగా...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 సూచీ 0.44 శాతం, మిడ్ క్యాప్ 0.64 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.77 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.54 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.18 శాతం, నిఫ్టీ ఐటీ 0.81 శాతం, నిఫ్టీ మీడియా 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 1.15 శాతం, నిఫ్టీ ఫార్మా 0.42 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.92 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.39 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications