ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 5) భారీ లాభాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడో సెషన్ లాభపడింది. సెన్సెక్స్ 276.65 పాయింట్లు(0.71%) లాభపడి 38,973.70 పాయింట్ల వద్ద, నిఫ్టీ 86.40 పాయింట్లు ఎగిసి(0.76%) 11,503.40 పాయింట్ల వద్ద ముగిసింది. 1,461 షేర్లు లాభాల్లో, 1,213 షేర్లు నష్టాల్లో, 173 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. ఉదయం ఓ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు ఎగిసింది. చివరకు అమ్మకాలు పెరగడంతో 277 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరంభ లాభాలు కోల్పోయాయి.

బ్యాంకు, ఐటీ స్టాక్స్ జూమ్
- సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ముగిసినప్పటికీ, ఉదయం లాభాల కంటే క్షీణించింది.
- ఐటీ స్టాక్స్, ఫైనాన్షియల్ స్టాక్స్ నిఫ్టీ భారీ లాభాలకు ఉపకరించాయి.
ఐసీఐసీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంచి లాభాలు నమోదు చేశాయి.
- నిఫ్టీ బ్యాంకు 125 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్స్ 17 పాయింట్లు నష్టపోయింది.
- ఐటీ గెయిన్స్ 3 శాతం మేర లాభపడ్డాయి.
- టీసీఎస్ టాప్ నిఫ్టీ గెయినర్. విప్రో ఇరవై ఏళ్ళ గరిష్టాన్ని తాకింది.
- స్టీల్ కంపెనీలు కూడా భారీ లాభాలు నమోదు చేశాయి. టాటా స్టీల్ 5 శాతం మేర లాభపడింది.
- స్పైస్ జెట్ 2 శాతం ఎగిశాయి. లండన్‌కు విమానాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో షేర్లు లాభపడ్డాయి.

ఐటీ స్టాక్స్ అదరగొట్టాయి
- టాటా కన్సల్టెన్సీ షేర్ (TCS) ధర 7.55 శాతం లాభపడి రూ.2,714 వద్ద క్లోజ్ అయింది. హెచ్‌సీఎల్ టెక్ కూడా 1.27 శాతం లాభపడి రూ.823.30 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 2.94 శాతం లాభపడి రూ.1,047.60 వద్ద, టెక్ మహీంద్రా షేర్ వ్యాల్యూ 2.78 శాతం లాభపడి రూ.845 వద్ద, విప్రో షేర్ వ్యాల్యూ 7 శాతం లాభపడి రూ.335 వద్ద, కోఫోర్జీ షేర్ ధర 0.26 శాతం లాభపడి రూ.2,341 వద్ద ముగిసింది. ఐటీ షేర్లు అన్నీ మంచి లాభాల్లో ముగిశాయి.
- టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, విప్రో, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఐదింట మూడు ఐటీ స్టాక్స్ ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీ సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, గెయిల్ ఉన్నాయి.

బలహీనపడిన రూపాయి
- డాలర్ మారకంతో భారత కరెన్సీ రూపాయి 73.29 వద్ద క్లోజ్ అయింది. అంతకు ముందు సెషన్‌లో 73.15 వద్ద క్లోజ్ అయింది. అంటే గత వారం కంటే 14 పైసలు నష్టపోయింది.
- మార్కెట్ లాభాలకు కరోనా రికవరీలు పెరగడంతో పాటు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారనే వార్తలు అంతర్జాతీయ మార్కెట్లను లాభాల్లోకి తీసుకు వచ్చాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీనికి ఐటీ షేర్ల హవా కలిసి వచ్చింది.
- ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇన్ఫ్రా, ఎనర్జీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications