ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(సెప్టెంబర్ 8) మందకోడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 64.53 పాయింట్లు (0.17%) నష్టపోయి 38,352.70 వద్ద, నిఫ్టీ 17.10 పాయింట్లు (0.15%) నష్టపోయి 11,337.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 599 షేర్లు లాభాల్లో, 393 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 51 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆ తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. మధ్యాహ్నం గం.11.39 సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు ఎగిసి 38,639 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు ఎగిసి 11,417 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఐటీ, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో సాఫ్టువేర్ కంపెనీలు ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ జాబితాలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ 5 గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్ ఉండగా, మిగతా నాలుగు ఐటీ సంస్థలో ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వరుసగా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, గ్రాసీమ్, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ ఉన్నాయి.

కరోనా మహమ్మారి కేసులు పెరగడం, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించారు. ఆ తర్వాత చైనాపై మనదే పైచేయి అని తెలియడం, కరోనా ప్యాకేజీ మరో విడత రానుండటం వంటి వివిధ కారణాలతో కాస్త కుదురుకున్నాయి. ఈ రోజు 38 కంపెనీలు ఫలితాలు వెల్లడించనున్నాయి. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి 30 పైసలు బలహీనపడి 73.64 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో రూపాయి 73.34 వద్ద క్లోజ్ అయింది.
వొడాఫోన్ ఐడియా నుండి పెట్టుబడుల ప్రకటన వస్తుందని భావించిన ఇన్వెస్టర్లు నిన్న ప్రారంభంలో ఈ షేర్లలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత బ్రాండ్ నేమ్ మార్పు, టారిఫ్ హైక్ గురించి మాత్రమే ప్రకటించడంతో షేర్ ధర ప్రారంభంతో పోలిస్తే తగ్గింది. ఓ సమయంలో 10 శాతం ఎగిసిన ధర ఆ తర్వాత 3 శాతంతో ముగిసింది. ఈ రోజు కూడా 5 శాతం మేర నష్టంతో ట్రేడ్ అవుతోంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ షేర్ ధర 2 శాతం ఎగిసి రూ.944 వద్ద, టీసీఎస్ షేర్ ధర 1.6 శాతం ఎగిసి రూ.2,365 వద్ద, HCL టెక్ షేర్ ధర 1.83 శాతం ఎగిసి రూ.721 వద్ద ట్రేడ్ అవతున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications