భారీ లాభాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 250 పాయింట్లు అప్, నిఫ్టీ 8,900 పైన
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 20) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 148.28 పాయింట్లు లేదా 0.49% తగ్గి 30,344.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 42.85 పాయింట్లు లేదా 0.48% లాభపడి 8,921.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. 392 షేర్లు లాభాల్లో, 220 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ ఆ తర్వాత దాదాపు 250 పాయింట్ల వరకు పెరిగింది.
ఐటీ ఇండెక్స్ మినహా మిగతా అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్, ఐటీసీ, లార్సన్, బీపీసీఎల్, నెస్ట్లే, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, వేదాంత, అదాని పోర్ట్స్ ఉన్నాయి.

సోమవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాలు చూసిన మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. అయితే దేశీయంగా కరోనా కేసులు లక్ష దాటటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 700 పాయింట్లు ఎగిసినప్పటికీ, చివరకు 167 పాయింట్లు మాత్రం లాభపడి 30,196 వద్ద ముగిసింది. నిఫ్టీ 55.85 పాయింట్ల లాభంతో 8,879 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్చి నెలతో ముగిసిన క్వార్టర్‌లో ఆర్పు పెరగడంతో భారతీ ఎయిర్ టెల్ షేర్ ఏకంగా 12.05 శాతం ఎగిసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరకు 11.34 శాతం లాభంతో రూ.599.15 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications