For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్మలమ్మ బడ్జెట్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చైనా నుంచి వచ్చి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో రెండు రోజులుగా మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ రోజు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 231.80 పాయింట్ల (0.57 శాతం) లాభంతో 41,198.66 వద్ద, నిఫ్టీ 73.30 పాయింట్ల (0.61) లాభంతో 12,129.10 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ 30 షేర్లలో 8 మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ ఫార్మా మినహా అన్ని రంగాలు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లె, ఐటీసీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, ఎస్బీఐ, రిలయన్స్, హిందూస్తాన్ యూనీలీవర్, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

 Sensex up 232 pts: small caps underperform

భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, సన్ ఫార్మా, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 71.24 వద్ద ఉంది.

బడ్జెట్‌పై 'బంగారమం'త ఆశలు, సుంకాలు ఎంత తగ్గించవచ్చు?బడ్జెట్‌పై 'బంగారమం'త ఆశలు, సుంకాలు ఎంత తగ్గించవచ్చు?

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఉంటాయనే సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం కూడా మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.

English summary

నిర్మలమ్మ బడ్జెట్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Sensex up 232 pts: small caps underperform

The frontline S&P BSE Sensex snapped two-day losing streak to settle 231.80 points, or 0.57 per cent, higher at 41,198.66 level.
Story first published: Wednesday, January 29, 2020, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X