For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫలితాల తర్వాత SBI కార్డ్ భారీ నష్టాల్లోకి, ఆర్థిక కార్యకలాపాలపై యూనీలీవర్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (అక్టోబర్ 23) లాభాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల లాభాలకు గురువారం బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈరోజు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 162.31పాయింట్లు (0.40%) లాభపడి 40,720.80 వద్ద, నిఫ్టీ 52.70 పాయింట్లు(0.44%) ఎగిసి 11,949.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఓ సమయంలో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల మేర లాభపడింది. 711 షేర్లు లాభాల్లో, 197 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 30 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆటో సూచీలు 1 శాతం లాభపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి.

ఫలితాల తర్వాత SBI కార్డ్ 10 శాతం డౌన్

ఫలితాల తర్వాత SBI కార్డ్ 10 శాతం డౌన్

సెప్టెంబర్ క్వార్టర్ ఫలిత నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ స్టాక్స్ ఓ సమయంలో ఏకంగా 10 శాతం నష్టపోయింది.

భారతీ ఇన్ఫ్రాటెల్ ఫలితాల ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఈ స్టాక్స్ రెండు శాతం లాభపడటం గమనార్హం.

వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, టాటా కామ్ స్టాక్స్ 0.65 శాతం నుండి 2.03 మధ్య పెరిగాయి.

టెక్ మహీంద్రా, నెస్ట్లే ఇండియా, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ సహా 38 సంస్థలు ఈ రోజు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.

టాప్ 5 ఐటీ సంస్థల్లో ఒకటైన టెక్ మహీంద్ర క్వార్టర్ ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

డాలర్ మారకంతో రూపాయి 11 పైసలు క్షీణించి 73.64 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. గురువారం 73.53 వద్ద క్లోజ్ అయింది.

పుంజుకుంటున్న కార్యకలాపాలు

పుంజుకుంటున్న కార్యకలాపాలు

ఉదయం గం.10 సమయానికి నిఫ్టీ 11,953 పాయింట్లకు చేరుకుంది. సెన్సెక్స్ 40,735 పాయింట్ల వద్ద ఉంది.

నిఫ్టీ బ్యాంకు 0.4 శాతం ఎగిసి 24,590 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.5 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.6 శాతం, నిఫ్టీ ఆటో 1.1 శాతం, నిఫ్టీ మీడియా 0.8 శాతం, నిఫ్టీ ఫార్మా 0.8 శాతం లాభపడ్డాయి.

టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇది 2.5 శాతం ఎగిసలింది.

50 నిఫ్టీ స్టాక్స్‌లో 39 లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

శ్రీసిమెంట్స్ 1 శాతం మేర నష్టపోయింది.

హిందూస్తాన్ యూనీలీవర్ స్టాక్ 0.56 శాతం నష్టాల్లో ట్రేడ్ అయింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ సేల్స్ పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన సేల్స్ 4.4 శాతం పెరిగాయి. భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని యూనీవర్ తెలిపింది.

ఐటీ స్టాక్స్ లాభాల్లో..

ఐటీ స్టాక్స్ లాభాల్లో..

ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ స్టాక్ 0.25 శాతం లాభపడి రూ.2,677, టెక్ మహీంద్ర స్టాక్ 0.34 శాతం లాభపడి రూ.840 వద్ద, విప్రో స్టాక్ 0.10 శాతం ఎగిసి రూ.345 వద్ద, మైండ్ ట్రీ స్టాక్ 0.91 శాతం లాభపడి రూ.1401 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే హెచ్‌సీఎల్ స్టాక్ 0.27 శాతం నష్టపోయి రూ.863 వద్ద, ఇన్ఫోసిస్ స్టాక్స్ 0.44 శాతం నష్టపోయి రూ.1,124 వద్ద, కోఫోర్జ్ స్టాక్ 2.39 శాతం క్షీణించి రూ.2,397 వద్ద ట్రేడ్ అయింది.

పదిన్నర సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్, అల్ట్రా టెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, గెయిల్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ జాబితాలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్ ఉన్నాయి.

English summary

ఫలితాల తర్వాత SBI కార్డ్ భారీ నష్టాల్లోకి, ఆర్థిక కార్యకలాపాలపై యూనీలీవర్ | Sensex up 200 points, Nifty above 11,900

All the sectoral indices are trading in the green with auto index rose 1 percent. Midcap and Smallcap indices are up marginally.
Story first published: Friday, October 23, 2020, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X