ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(జూన్ 22) భారీలాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 180.32 పాయింట్లు లేదా 0.52% ఎగిసి 34,912.05 వద్ద, నిఫ్టీ 60.40 పాయింట్లు లేదా 0.59% పెరిగి 10,304.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 984 షేర్లు లాభాల్లో, 243 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 59 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి 76.17 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 76.19 వద్ద క్లోజ్ అయింది.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. మార్కెట్లోకి కరోనా డ్రగ్ రావడం ఆశాజనక ఫలితాలు ఇస్తున్నాయి. రెమ్‌డెసివిర్, గ్లెన్‌మార్క్ ఫ్యాబిఫ్లూ అందుబాటులోకి తేవడంతో ఫార్మా రంగాల షేర్లు జూమ్ అన్నాయి. గ్లెన్ మార్క్ షేర్లు అయితే ఏకంగా 35 శాతం ఎగిశాయి. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, ఇన్ఫో ఎడ్జ్, ఎకో బ్యాంకు లాభాల్లో ఉన్నాయి. గ్లెన్ మార్క్ షేర్ ఏకంగా 30 శాతానికి పైగా రూ.540 పలికింది. ఓ సమయంలో 35 శాతం పెరిగింది.

మధ్యాహ్నం గం.12 సమయానికి టాప్ 5 గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, హిండాల్కో, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications