కరోనా కేసులు తగ్గి ఆర్థిక రికవరీ కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్భణం కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన ఆర్బీఐ ఎంపీసీ అనూహ్య నిర్ణయం తీసుకున్నది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వడ్డీ రేటు 4.40 శాతానికి పెరిగింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది.

అందుకే సర్దుబాటు ధోరణి
ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి సర్దుబాటు ధోరణిని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్భణాన్ని ఆందోళనకరస్థాయికి తీసుకు వెళ్తుండటంతో అత్యవసరంగా బేటీ కావాల్సి వచ్చిందని వెల్లడించారు. జూన్‌లో తదుపరి ఎంపీసీ సమావేశం ఉంది. అప్పుడే వడ్డీ రేట్లు పెంచుతారని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఫుడ్ ఐటమ్స్ ధరలు పెరుగుతుండటంతో ఫిబ్రవరిలో 6.07 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం మార్చిలో 6.95 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కూడా పెరిగాయి. దీంతో హోల్ సేల్, రిటైల్ ద్రవ్యోల్భణాల మధ్య అంతరం జనవరిలో 4.7 శాతం కాగా, ప్రస్తుతం 2.3 శాతానికి తగ్గింది.

అందుకే మార్కెట్ నష్టాల్లో..
ఆర్బీఐ రెపో రేటును భారీగా తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కానీ గవర్నర్ మధ్యాహ్నం గం.2కు కీలక ప్రకటన చేస్తారని తెలియగానే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం శక్తికాంత దాస్ ప్రకటన అనంతరం మరింత కుప్పకూలాయి. నిన్న సూచీలు 56,976 పాయింట్ల వద్ద ముగిశాయి. కానీ ఆర్బీఐ వడ్డీ రేటు పెంపు ప్రకటన అనంతరం సెన్సెక్స్ ఏకంగా 1306 పాయింట్లు క్షీణించి 55,669 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు 7000 పాయింట్ల దూరంలో ఉంది. ఓ సమయంలో 1450 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 391 పాయింట్లు తగ్గి 16,677 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణించాయి.

అన్ని రంగాలు నష్టాల్లోనే...
అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, పవర్, మెటల్, రియాల్టీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 1 శాతం నుండి 3 శాతం మేర క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలు 2.63 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 2.11 శాతం పడిపోయింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 23 పైసలు పెరిగి 76.42 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో 76.65 వద్ద ముగిసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications