అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్భణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం, రాబోయే నెలల్లో ఫెడ్ రేట్ల పెంపుదల వంటి అంశాలు వాల్ స్ట్రీట్ నుండి దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. క్రితం సెషన్‌లో అమెరికా సూచీలు డౌజోన్స్ 1.47 శాతం, నాస్‌డాక్ 2.10 శాతం, ఎస్ అండ్ పీ 1.81 శాతం నష్టపోయాయి. భారత మార్కెట్లు కూడా అదే దారిలో నడిచాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నేడు దారుణంగా పతనమయ్యాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఐటీ రియాల్టీ సూచీలు రెండు శాతం వరకు, ఆటో, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకు, ఎఫ్ఎంసీజీ 1 శాతం మేర క్షీణించగా, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ విల్మర్ మాత్రం మంచి లాభాల్లో ట్రేడ్ అవుతోంది.

అందుకే నష్టాల్లో మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలతో దేశీయంగా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. ఓ సమయంలో 58,000 స్థాయి దిగువకు కూడా పడిపోయింది. అమెరికా ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. దీంతో వడ్డీ రేట్ల పెంపును ఫెడ్ మరింత వేగంగా పెంచనుంది అని సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గురువారం అక్కడి మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

రూ.3.40 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ నేడు ఒక్కరోజే 3.4 లక్షల కోట్లు ఆవిరయింది. బీఎస్ఈ మెజార్టీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 75.33 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెయ్యి పాయింట్లకు పైగా డౌన్
సెన్సెక్స్ 58,447.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,447.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,914.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,451.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,454.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,303.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.50 సమయానికి 703 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టపోయి 58,222 పాయింట్ల వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టపోయి 17,394 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 58,926 పాయింట్ల వద్ద ముగియగా, నేడు ఓ సమయంలో 57,914 పాయింట్లకు పడిపోయింది. అంటే ఓ సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా క్షీణించింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications