ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(మార్చి 30) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు ఒక్కోటి రెండు శాతం చొప్పున ఎగిసిపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి నేడు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. 72.81 వద్ద ప్రారంభమైన రూపాయి, మధ్యాహ్నం సమయానికి 73.14 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 72.67 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 50,000 పాయింట్లకు చేరుకుంది. ఏకంగా దాదాపు వెయ్యి పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 14,800 వద్దకు చేరుకుంది. స్టాక్ మార్కెట్లు చివరి సెషన్లోను భారీగా లాభపడ్డాయి. అయితే అంతకుముందు రెండు సెషన్లలో 1600 పాయింట్లకు పైగా క్షీణించింది.

సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు ఉదయం 49,331.68 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,995.97 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,331.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,628.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,800.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,617.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.45 సమయానికి సెన్సెక్స్ 1,003.32 (2.05%) పాయింట్లు ఎగిసి 50,011.82 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 293.30 (2.02%) పాయింట్లు ఎగిసి 14,800.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 6.14 శాతం, JSW స్టీల్ 5.28 శాతం, టాటా స్టీల్ 4.50 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.82 శాతం, HCL టెక్ 3.68 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్ 0.62 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.44 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.45 శాతం, టాటా మోటార్స్ 0.03 శాతం, IOC 0.11 శాతం నష్టాల్లో ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ టాటా స్టీల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 2.05 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.60 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.52 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.66 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.74 శాతం, నిఫ్టీ ఐటీ 2.85 శాతం, నిఫ్టీ మెటల్ 2.98 శాతం నిఫ్టీ ఫార్మా 2.14 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.37 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.43 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా 0.75 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.99 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications