స్టాక్ మార్కెట్లు మంగళవారం(8 ఫిబ్రవరి 2022) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్, ఆ తర్వాత కుదురుకుంది. అయితే లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం ఊగిసలాటలో కనిపించాయి. ప్రస్తుతం యూఎస్ ఫ్యూచర్స్ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో అక్కడి టెక్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా షేర్ 52 వారాల కనిష్టానికి పడిపోయింది.
ఆల్ టైమ్ గరిష్టం నుండి ఈ స్టాక్ 30 శాతం క్షీణించడం గమనార్హం. గూగుల్ స్టాక్ మూడు శాతం పడిపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణ భయాలు, ఉద్దీపనల ఉపసంహరణ, రేట్ల పెంపు వంటి ఆందోళనలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, దేశీయంగా ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ముడి చమురు ధరల పెరుగుదల కూడా సూచీలపై ప్రభావం చూపుతుంది.

గరిష్టం.. కనిష్టం
సెన్సెక్స్ 57,799.67 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,925.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,058.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,279.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,306.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,043.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.22 సమయానికి 105 పాయింట్లు క్షీణించి 57,725 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 17,235 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల వరకు పతనమైనప్పటికీ, కిందపడినంత వేగంగా పుంజుకొని భారీ నష్టాన్ని తగ్గించుకుంది. అయితే మధ్యాహ్నం గం.12.50 సమయానికి మాత్రం సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఏకంగా 200 పాయింట్లు ఎగబాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పేయింట్స్, టైటాన్ కంపెనీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఓఎన్జీసీ, ఐవోసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా, టీసీఎస్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ ఉన్నాయి.

వరుసగా నాలుగో రోజు
నేటి నుండి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. అలాగే ఎఫ్ఐఐల అమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.కాగా, సెన్సెక్స్, నిఫ్టీలు ఈవారం ఊగిసలాటలో ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి. సెన్సెక్స్ గతవారం 2.5 శాతం ఎగిసి 58,645 పాయింట్ల వద్ద, నిఫ్టీ దాదాపు అంతేస్థాయిలో లాభపడి 17,516 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న మాత్రం నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు వారం కూడా చివరి రెండు వారాలు నష్టపోయింది. వరుసగా మూడు రోజులు నష్టపోయిన మార్కెట్, నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ఉంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications