ముంబై: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, ఆ తర్వాత పుంజుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 30, బుధవారం) మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 94.71 పాయింట్లు(0.25%) లాభపడి 38,067.93 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు(0.04%) ఎగిసి 11,226.50 పాయింట్ల వద్ద ముగిసింది. 1196 షేర్లు లాభాల్లో, 1370 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
151 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకులు, మెటల్ స్టాక్స్ భారీ నష్టాలను చూశాయి. బీపీసీఎల్ టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టీ 50లో భారీగా నష్టపోయింది బీపీసీఎల్. ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు లాభాల్లో ముగిశాయి. రూపాయి 73.76 వద్ద క్లోజ్ అయింది. నిన్న డాలర్ మారకంతో 73.85 వద్ద ముగిసింది. ఈ రోజు స్వల్పంగా లాభపడింది.

బీపీసీఎల్ 9% డౌన్ ఎందుకంటే..
- భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) 9 శాతానికి పైగా నష్టాల్లో ముగిసింది. కేంద్ర ప్రభుత్వం వాటాల విక్రయాన్ని నాలుగోసారి పొడిగించింది. దీంతో స్టాక్స్ పడిపోయాయి. ప్రభుత్వం డెడ్‌లైన్‌ను నవంబర్ 16వ తేదీకి పొడిగించింది. బిడ్స్ దాఖలు చేసేవారికి సమయం పొడిగింపు ఊరట ఇవ్వడం ఇది నాలుగోసారి. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రితంసారి ఈరోజు (సెప్టెంబర్ 30) వరకు గడువును పొడిగించగా, ఈసారి నవంబర్ వరకు పొడిగించారు.
- నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

అందుకే హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్స్ జూమ్
- నిఫ్టీ బ్యాంకు 41 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ సూచీ 9 పాయింట్లు నష్టపోయింది.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిసి, మార్కెట్ లాభాలను తగ్గించాయి.
- జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు పెట్టడంతో రిలయన్స్ షేర్లు తొలుత లాభాల్లోకి వచ్చినప్పటికీ, చివరకు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి.
- వ్యాపారం తిరిగి కరోనా ముందుస్థాయికి చేరుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటించడంతో షేర్లు పుంజుకున్నాయి.
- మెటల్స్ తీవ్ర ఒత్తిడిలో ముగిశాయి. మెటల్ ఇండస్ట్రీలో టాటా టాప్ లూజర్.
- పానాసీ బయో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. యూఎస్ ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయడంతో ప్రభావం పడింది.
- మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్‌లో సోలార్ యాక్టివ్, జస్ట్ డయల్, టోరెంట్ ఫార్మా ఉన్నాయి.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్
- టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, శ్రీ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఉన్నాయి.
- డెరివేటివ్ కౌంటర్లలో టోరంట్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, గోద్రెజ్ సీపీ, ఐపీ హౌసింగ్, డాబర్, రాంకో సిమెంట్, కెడిలా హెల్త్, శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ లాభాల్లో ముగిశాయి.
- ఐటీ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోఫోర్జ్ నష్టాల్లో ముగియగా, టెక్ మహీంద్రా, విప్రో లాభాల్లో ముగిశాయి.

ఐపీవోలు...
- లిఖితా ఇన్ఫ్రా ఐపీవో 2.4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. హైదరాబాద్‌కు చెందిన లిఖితా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుండి మంచి ఆదరణ వచ్చింది. రూ.61.2 కోట్ల ఐపీవోకు 54 లక్షల షేర్ల ఆఫర్ సైజ్‌కు గాను 1.24 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్స్ వచ్చాయి. దాదాపు రెండున్నర రెట్ల మేర సబ్‌స్క్రైబ్ అయ్యారు.
- యూటీఐ ఏఎంసీ ఐపీవో 53 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. రూ.2,160 కోట్ల ఐపీవోకు సంబంధించి 2.73 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 1.46 కోట్ల ఈక్విటీ షేర్లు వచ్చాయి. ఈ షేర్ ధర రూ.552-రూ.554గా ఉంది.
- మూలధన సేకరణ కోసం ఎస్బీఐ బోర్డు అంగీకరించింది.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications