ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 6) ఫ్లాట్‌గా ఉన్నాయి. నిన్న మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. రెండు రోజుల క్రితం 48వేల మార్కు దాటిన సెన్సెక్స్ 46,500 దిశగా సాగుతోంది. నిన్న ఉదయం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ప్రారంభంలో నష్టాల్లో కనిపించినప్పటికీ, చివరకు లాభాల్లో ముగిశాయి. నేడు ప్రారంభంలో ఊగిసలాట ధోరణి కనిపించింది. సెన్సెక్స్ 48,500 దిశగా కనిపించి, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. తిరిగి స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయింది.

లాభ నష్టాల్లో..
స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 107.64 పాయింట్లు(0.22%) లాభపడి 48,545.42 పాయింట్ల వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు(0.20%) ఎగిసి 14,228.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1151 షేర్లు లాభాల్లో, 270 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 64 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఎఫ్ఎంసీజీ రంగం మినహా మిగతా రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సూచీలు పైకి, కిందకు కదులుతున్నాయి. డాలర్ మారకంతో రూపాయి 73.17 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 73.17 వద్ద క్లోజ్ అయింది.

రిలయన్స్ మరింత పతనం
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 3.52 శాతం, ONGC 3.37 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.68 శాతం, SBI 2.04 శాతం, ఐవోసీ 1.88 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ITC 1.58 శాతం, రిలయన్స్ 1.40 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.12 శాతం, హెచ్‌యూఎల్ 0.84 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.90 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మరింత పతనమైంది. నేడు రూ.1940 కంటే దిగువన ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11 సమయానికి 1.50 శాతం నష్టపోయి 1936 వద్ద ట్రేడ్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎనర్జీ బిజినెస్‌లో 20 శాతం వాటా కొనుగోలుపై సౌదీ ఆరామ్‌కో పునరుద్ధరించే అవకాశాలు ఉన్నయని ఫారెన్ బ్రోకరేజీ కంపెనీ క్రెడిట్ సూయిజ్ అభిప్రాయపడింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.09 శాతం, నిఫ్టీ 50 మిడ్ క్యాప్ 0.94 శాతం మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.67 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.14 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం, నిఫ్టీ మీడియా 1.39 శాతం, నిఫ్టీ మెటల్ 0.71 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.23 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.57 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.30 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.49 శాతం నష్టాల్లో ఉంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications