సెన్సెక్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఓ సమయంలో 42,000 మార్క్ అందుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా మార్చి 23న దారుణంగా పతనమైంది. లాక్ డౌన్ సమయంలో అంతకంతకూ పడిపోయింది. గత రెండు నెలలుగా క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 38వేలకు పైన ఉంది. బీఎస్ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ మార్చి 2021 నాటికి 6 శాతం ఎగిసి 41,500 పాయింట్లను తాకుతుందని ఫ్రాన్స్ బ్రోకరేజీ సంస్థ బీఎన్‌పీ పారిబస్ అంచనా వేసింది.

మూలాలు ఒత్తిడితో ఉన్నా.. అదే బలం
సులభ ద్రవ్యలభ్యత కారణంగా సెన్సెక్స్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 41,500 తాకుతుందని చెబుతోంది. కరోనా వల్ల ఆర్థికవృద్ధి రేటు మైనస్‌స్థాయికి క్షీణించినప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తుండటంపట్ల పలువురు మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరింత కాలం మార్కెట్లు సానుకూలంగానే ఉంటాయని ఈ సంస్థ చెబుతోంది. కానీ మూలాలు కొంత ఒత్తిడితో ఉన్నట్లు చెబుతోంది. భారత్‌లో అమెరికా, చైనా వలే తదుపరి తరం వ్యాపారాలను సృష్టించే పరిస్థితి లేకపోయినప్పటికీ 130 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని, అదే భారత్‌కు ఉన్న సత్తా అన్నారు.

షా హెచ్చరిక.. ఇన్వెస్టర్లు సూపర్
అధిక ద్రవ్య లభ్యతతో మార్కెట్లో మరింత ర్యాలీ కొనసాగనుందని పారిబస్ ఇండియన్ ఈక్విటీ రీసెర్చ్ విభాగం అధిపతి అమిత్ షా అన్నారు. కానీ ఆర్థిక వ్యవస్థ మూలాలు ఒత్తిడితో కదులుతున్నాయని హెచ్చరించారు. మార్చిలో మార్కెట్లు భారీగా పతనమైన సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేయడాన్ని ప్రశంసించారు. సాధారణంగా మార్కెట్లు బాగా పెరిగి షేర్ల ధరలు గరిష్ఠస్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు సరైన సమయంలో మార్కెట్లోకి ప్రవేశించారన్నారు.

ఐటీ కంపెనీలకు ఆదా, రియల్ ఎస్టేట్‌లో కరెక్షన్
ఆర్థిక సేవల రంగం విషయానికి వస్తే 2023 నాటికి ఫిన్‌టెక్‌లోకి రూ.1500 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావొచ్చునని తెలిపింది. కరోనా సంక్షోభంతో దేశీయ కస్టమర్లలో వచ్చిన అలవాట్లలో వచ్చిన మార్పులు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. మొబైల్ బ్యంకులు, డిజిటల్ సేవల్లో ఇన్వెస్ట్ చేయని బ్యాంకులు తమ డిపాజిట్లు కోల్పోవచ్చునని, డిజిటల్ సేవల్లో చురుకైన బ్యాంకులు వీటిని చేజిక్కించుకోవచ్చునని తెలిపింది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో ఐటీ కంపెనీల వ్యయాల్లో 2.5 శాతం మేర ఆదా కానుందని, సాధారణ పరిస్థితులు వచ్చాక కూడా 40 శాతం మంది ఇంటి నుండే పని చేయవచ్చునని పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగంలో మరింత కరెక్షన్‌కు అవకాశముందని తెలిపింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications