సెప్టెంబర్ 2024 నుండి భారత స్టాక్‌లలో తగ్గుదల భారతదేశ దీర్ఘకాలిక కథనాన్ని కొనుగోలు చేయడానికి ఒక అవకాశంగా అభివర్ణిస్తూ, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ జూన్ 2026 నాటికి సెన్సెక్స్‌కు 89,000 కు చేరుకుంటుందని కొత్త లక్ష్యాన్ని ఇచ్చింది .
ప్రస్తుత మార్కెట్ తగ్గుదలని భారత దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా చెబుతున్న గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మార్గన్ స్టాన్లీ..సెన్సెక్స్‌కు జూన్ 2026 నాటికి 89,000 పాయింట్ల లక్ష్యాన్ని ప్రకటించింది. అయితే బుల్ కేస్ సన్నివేశంలో దాదాపు 30% అవకాశముందని వారు పేర్కొంటూ ..సెన్సెక్స్ 1 లక్షను తాకే అవకాశమూ ఉందని విశ్లేషించారు.

మార్గన్ స్టాన్లీ ఎక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ తెలిపిన ప్రకారం..మా బేస్ కేస్ ప్రకారం జూన్ 2026 నాటికి సెన్సెక్స్ లక్ష్యం 89,000. ఇది డిసెంబర్ 2025 లక్ష్యం అయిన 82,000 పైగా ఉంది. ఈ స్థాయిలో ట్రైలింగ్ PE మల్టిపుల్ 23.5x ఉంటుంది, ఇది గత 25 ఏళ్ల సగటు 21x కన్నా ఎక్కువ.అయితే ఇది లక్ష వరకు తాకే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రీమియం భారతదేశంపై ఉన్న స్థిరమైన మద్దతు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, విధానాలలో స్థిరత్వం, తక్కువ బీటా కారణంగా ఏర్పడినదని పేర్కొన్నారు.2028 వరకూ సెన్సెక్స్ ఆదాయ వృద్ధి CAGR 16.8% ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
దీని కారణాలు ఏంటంటే.. భారతదేశంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి కొనసాగుతోంది. అదే సమయంలో అమెరికాలో నెమ్మదిగా వృద్ధి కొనసాగుతోంది. అయితే మాంద్యం కాదని చెప్పవచ్చు. ఇక చమురు ధరలు నియంత్రిత స్థాయిలో ఉండడం, భారత్-USA ట్రేడ్ డీల్ వంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. షార్ట్ టర్మ్ వడ్డీ రేట్లలో 50 బిప్స్ తగ్గింపు, అనుకూల లిక్విడిటీ వాతావరణం అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. 2028 వరకూ సెన్సెక్స్ ఆదాయ వృద్ధి CAGR 16.8% ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా మార్గన్ స్టాన్లీ ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాల్లో overweight గా ఉండగా, ఎనర్జీ, మెటీరియల్స్, యుటిలిటీస్, హెల్త్‌కేర్ రంగాల్లో underweight గా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ఠ స్థాయిలో ఉన్నారని మార్గన్ స్టాన్లీ చెబుతూ, ఇప్పటికే వారి దృష్టి భారత మార్కెట్లపై మారడం కనిపిస్తున్నట్లు పేర్కొంది. ఇకపై రిటైల్ పెట్టుబడిదారుల సహకారంతో మార్కెట్ తిరిగి బలపడే అవకాశముందని విశ్లేషించింది.
ఇదిలా ఉంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) స్టాక్‌లను తమ పోర్ట్‌ఫోలియోలలో కలిగి ఉన్న పెట్టుబడిదారులకు ప్రస్తుతం అయోమయ పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల సుంకాల విరామం, భారతదేశం మరియు చైనాతో సహా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కఠినమైన చర్చలు సెంటిమెంట్‌ను పెంచగా, మూడీస్ ఆర్థిక వ్యవస్థ క్రెడిట్ రేటింగ్‌లను తగ్గించడం మార్కెట్ దృక్పథాన్ని మళ్ళీ అస్పష్టంగా మార్చింది.


Click it and Unblock the Notifications