ముంబై: స్టాక్ మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రారంభ భారీ లాభాల నుండి, మధ్యాహ్నానికి స్వల్ప లాభాల్లోకి వెళ్లి, చివరకు నష్టాల్లోకి జారిపోయాయి. ఆద్యంతం ఊగిసలాటలోనే కనిపించాయి. ఓ సమయంలో మార్కెట్లు 300 పాయింట్లకు పైగా నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత నష్టాలు తగ్గాయి.
సెన్సెక్స్ 65.66 పాయింట్లు(0.17%) నష్టపోయి 37,668.42 వద్ద, నిఫ్టీ 21.80 పాయింట్లు(0.20%) కోల్పోయి 11,131.90 పాయింట్ల వద్ద ముగిసింది. 1,213 షేర్లు లాభాల్లో, 1,382 షేర్లు నష్టాల్లో, 155 షేర్లలో ఎలాంటి మార్పులేదు. పీఎస్‌యూ బ్యాంకులు, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిసాయి.

డే హై నుండి 800 పాయింట్లు డౌన్
- సెన్సెక్స్ డే-హై నుండి 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 300 పాయింట్ల వరకు లాభపడి ఓ సమయంలో 38,140ని తాకింది. మధ్యాహ్నం 37,313 పాయింట్లకు పడిపోయింది. అంటే దాదాపు 750 పాయింట్ల మేర డేహై నుండి పడిపోయింది. చివరకు 65 పాయింట్ల నష్టంతో 37,668 వద్ద ముగిసింది.
- సెన్సెక్స్ వరుసగా 5వ రోజు నష్టాల్లో ముగిసింది. గత వారంలో రెండు రోజులు, ఈ వారం ప్రారంభం నుండి మూడ్రోజులు నష్టాల్లో ముగిసింది.
- ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టపోయాయి. దిగ్గజ కంపెనీలు ఎక్కువగా నష్టపోవడంతో మార్కెట్ పైన ఎక్కువ ప్రభావం పడింది.
- సెన్సెక్స్ 30లో 18 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

ఫార్మా డౌన్, ఐటీ స్టాక్స్ మిశ్రమం..
- నిఫ్టీ ఫార్మా 1 శాతానికి పైగా నష్టపోయింది. బయోకాన్ మాత్రమే 0.56 శాతం లాభపడింది. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, ఆల్కెమ్ షేర్లు 0.95 శాతం నుండి 2 శాతం లోపు నష్టపోగా, లుపిన్, ఆరబిందో ఫార్మా, దివిస్ ల్యాబ్స్, టోరెంట్ ఫార్మా, కాడిలా హెల్త్ కేర్ 2.13 శాతం నుండి 2.44 శాతం మేరభారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.
- టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, గెయిల్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, హిండాల్కో ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
- ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ షేర్ 2.45 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్ .073 శాతం, టెక్ మహీంద్ర షేర్ 0.99 శాతం, మైండ్ ట్రీ షేర్ 1.13 శాతం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ 4.37 శాతం, ఇటీవల లిస్ట్ అయిన హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ షేర్ 0.97 శాతం మేర నష్టపోగా, ఇన్ఫోసిస్ షేర్ 1.23 శాతం, విప్రో షేర్ 0.69 శాతం, కోఫోర్జ్ షేర్ .04 శాతం, సొనాటా సాఫ్టువేర్ షేర్ 0.24 శాతం లాభపడ్డాయి. బిర్లా సాఫ్ట్ స్టాక్‌లో ఎలాంటి మార్పులేదు.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు జియో ప్లాన్ దెబ్బ
- నిఫ్టీ బ్యాంక్ 350 పాయింట్ల మేర లాభపడ్డాయి.
- నిఫ్టీ రికవరీలో రిలయన్స్ 0.76 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.31 శాతం, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ లాభాలతో నిఫ్టీ రికవరీకి ఉపకరించాయి.
- మిడ్ క్యాప్ ఇండెక్స్ 54 పాయింట్లు నష్టపోయింది.
- రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ప్రభావంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(వీఐ) షేర్లు భారీగా నష్టపోయాయి. వొడాఫోన్ ఐఢియా షేర్ ఏకంగా 10.73 శాతం, ఎయిర్‌టెల్ 8.16 శాతం మేర నష్టపోయాయి.
- కేకేఆర్ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లోకి దూసుకెళ్లింది.
- కొత్తగా నమోదైన రూట్ మొబైల్స్ 20 శాతం ఎగిసింది.
- స్టెర్లింగ్ అండ్ విల్సన్ 20 శాతం మేర లాభపడింది.
- టాటా కెమికల్స్, రెడింగ్టన్, పేజ్ ఇండస్ట్రీస్, ముతూట్ ఫైనాన్స్ వంటివి మిడ్ క్యాప్‌లో లాభపడ్డాయి.
- శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్, లారస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, ఎల్ఐసీ హౌసింగ్ టాప్ మిడ్ క్యాప్ లూజర్స్‌గా నిలిచాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications