ముంబై: భారత మార్కెట్లు సోమవారం (జూన్ 15) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 9,900 పాయింట్లకు దిగువన ప్రారంభమైంది. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 309.95 పాయింట్లు లేదా 0.92 శాతం నష్టపోయి 33,470.94 వద్ద, నిఫ్టీ 86.95 పాయింట్లు లేదా 0.87 శాతం తగ్గి 9,885.95 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 640 స్టాక్ లాభాల్లో, 470 స్టాక్స్ నష్టాల్లో ప్రారంభం కాగా, 75 షేర్లలో మార్పు లేదు. సెన్సెక్స్ ఓ సమయంలో ఏకంగా దాదాపు 750 పాయింట్లు నష్టపోయింది.

ఈ షేర్లు నష్టాల్లో
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, జీ ఎంటర్టైన్మెంట్, వేదాంత, ఐచర్ మోటార్స్, విప్రో ఉన్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్ట్లే, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా,టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనీలీవర్, హెచ్‌సీఎల్ టెక్ వంటి సంస్థలు ఉన్నాయి. అమెరికా డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు బలహీనపడి 75.94 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో (శుక్రవారం) 75.84 వద్ద క్లోజ్ అయింది. ఆసియా మార్కెట్లు కూడా ఈ రోజు నష్టాల్లోనే ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు లాభాల్లో.. నష్టాల్లో ఆసియా మార్కెట్లు
శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం డౌజోన్స్ ఇండస్ట్రియల్ 477 పాయింట్లు ఎగిసింది. S&P 500 కూడా 39 పాయింట్లు, నాస్‌డాక్ 96 పాయింట్లు పెరిగింది. అయితే భారత్ సహా ఆసియా మార్కెట్లు సోమవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలు కూడా పడిపోయాయి. ఈ ప్రభావం మార్కెట్లపై పడింది.

పడిపోయిన చమురు ధరలు
జపాన్ మార్కెట్ 0.25 శాతం, ఆస్ట్రేలియా షేర్లు 0.4 శాతం, సౌత్ కొరియా 0.6 శాతం పడిపోయాయి. జపాన్ నిక్కీ 0.75 శాతం నష్టపోయింది. కరోనా భయాల కారణంగా సోమవారం చమురు ధరలు 2 శాతం పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 66 సెంట్లు లేదా 1.7 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 38.07 డాలర్లు, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 81 సెంట్లు లేదా 2.2 శాతం పడిపోయి బ్యారెల్ 65.45 డాలర్లు పలికింది.


Click it and Unblock the Notifications