కాస్త నిలబెట్టిన రిలయన్స్: కుప్పకూలిన మార్కెట్లు, కారణాలివే

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 15) భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 552 పాయింట్లు లేదా 1.63 శాతం నష్టపోయి 33,229 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు లేదా 1.6 శాతం నష్టపోయి 9,814 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 76.02 వద్ద ఉంది. మార్కెట్లు ప్రారంభం నుండే నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఓ దశలో 760 పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసి, చివరకు కాస్త నష్టాన్ని తగ్గించుకుంది. మార్కెట్ నష్టాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

నిలబెట్టిన రిలయన్స్

నిలబెట్టిన రిలయన్స్

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 3 శాతం నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 171 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ బ్యాంకు 742 పాయింట్లు నష్టపోయింది. 44 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు కారణంగా 87 పాయింట్లు దిగజారగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 21 పాయింట్లు నిలబెట్టింది.

జియో డీల్స్ కారణంగా రిలయన్స్ షేర్ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ షేర్ రూ.1,612.30తో రికార్డుకు చేరుకుంది. ఈ రోజు రూ.23.50 లేదా 1.48 శాతం ఎగిసింది. మిడ్ క్యాప్ గెయినర్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, జుబిలాంట్ లైఫ్ సైన్సెస్, టీవీ 18, ఆయిల్ ఇండియా ఉన్నాయి. టాప్ గెయినర్‌గా గెయిల్ నిలిచింది.

పెరుగుతున్న కరోనా కేసులు

పెరుగుతున్న కరోనా కేసులు

స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పెను ప్రమాదం అని గత కొంతకాలంగా చెబుతున్నారు. తాజాగా చైనాలో కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడం మార్కెట్‌ను భయానికి గురి చేసింది. అలాగే, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వైరస్ తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ కేసులు ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. చమురు ధరలు కూడా పడిపోయాయి. ఆసియా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. జపాన్ నిక్కీ 3.47 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 4.76 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2.16 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 కూడా 2.19 శాతం నష్టపోయాయి. చైనా షాంఘై కాంపోజిట్ 1 శాతానికి పైగానష్టాల్లోకి వెళ్లింది. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడ్డాయి.

లాక్ డౌన్ భయాలు

లాక్ డౌన్ భయాలు

కరోనా కారణంగా మార్చి 25వ తేదీన ప్రారంభమైన లాక్ డౌన్ దాదాపు మూడు నెలలు కొనసాగింది. ఇటీవలే క్రమంగా లాక్ డౌన్ ఆంక్షలు తొలగిస్తున్నారు. అయితే దేశంలోని ముఖ్య నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ నగరాల్లో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అలా కాదంటే కంటైన్మెంట్ జోన్లలో విధిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెలలో మార్కెట్‌ను పరిశీలిస్తున్నారు.

దెబ్బతీసిన బ్యాంకింగ్

దెబ్బతీసిన బ్యాంకింగ్

గత రెండు నెలలుగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ పతనానికి ముఖ్య కారణం బ్యాంకింగ్, ఆర్థికరంగాల సర్దుబాటే. నిఫ్టీ బ్యాంకు 3.6 శాతం పడిపోయి 19,912.90 వద్ద, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.9 శాతం నష్టపోయి 9,818 పాయింట్ల వద్ద ముగిసింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాల్టీ, ఇన్ఫ్రా సూచీలు 1 శాతం నుండి 3 శాతం నష్టపోయాయి.

ఇతర కారణాలు

ఇతర కారణాలు

భారత పారిశ్రామిక ఉత్పత్తి (IIP) ఏప్రిల్ నెలలో 55.5 శాతం క్షీణించిందని భావిస్తున్నారు. మార్చి నెలలో 18.3 శాతం తగ్గింది. ప్రభుత్వం వీటిని విడుదల చేయలేదు. అలాగే హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) మే నెలలో 3.21 శాతం క్షీణిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. నిఫ్టీ 9,700 వద్ద మద్దతు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది దాటితే గత వారం 9,544 పాయింట్లకు పడిపోతుందని చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+