భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: గరిష్టం నుండి సెన్సెక్స్ 445 పాయింట్లు డౌన్

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూలై 27) భారీ లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోని సూచీలు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నేడు 273.51 (0.52%) పాయింట్లు నష్టపోయి 52,578.76 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78.00 (0.49%) పాయింట్లు క్షీణించి 15,746.45 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేటి గరిష్టం నుండి 445 పాయింట్ల మేర పతనంతో ముగించింది.

నేడు సెన్సెక్స్ 600 పాయింట్ల మేర ఉత్తానపతనాలు చూసింది. ఓ సమయంలో 53,000 పాయింట్లు దాటింది. 52,995.72 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 53,024.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,433.18 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,900 పాయింట్ల సమీపానికి కూడా చేరుకుంది. నిఫ్టీ 15,860.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,881.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,701.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

Sensex tanks 445 points from day’s high, Nifty below 15,750

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, HDFC బ్యాంకు, టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+