స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను కోలుకోలేదు. ఓ సమయంలో దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోయిన సూచీలు, మధ్యాహ్నం గం.12.45 సమయానికి కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు అప్రమత్తంగా కదలుతున్నాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వేగంగా ఉండనుందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తోంది.
అమెరికా - రష్యా ఉద్రిక్తతలు, ఫెడ్ వడ్డీ రేటులు, చమురు ధరలు మళ్లీ పెరుగుతుండటం, ద్రవ్యోల్భణ ఆందోళనల వంటి అంశాలు ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్షపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. కీలక కంపెనీలు తాజా గరిష్టాలకు చేరుకున్నాయి. దీంతో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. HDFC, HDFC బ్యాంకు విలీనం నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈ స్టాక్స్ పరుగులు పెట్టాయి. నిన్న, నేడు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్ఐఐ, డీఐఐల కొనుగోళ్లు నెమ్మదించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 59,815 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,941 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,509 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.45 సమయానికి 281 పాయింట్లు ఎగిసి 59,881 పాయింట్ల వద్ద, నిఫ్టీ 76.80 పాయింట్లు ఎగిసి 17,880 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఒక్కో శాతం చొప్పున లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్, ఐటి, రియాల్టీ ఒక్కో శాతం చొప్పున నష్టాల్లో ఉన్నాయి. HDFC, HDFC బ్యాంకులు భారీ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications