ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(డిసెంబర్ 21) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,406.73 (3.00%) పాయింట్లు నష్టపోయి 45,554 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 432.15 (3.14%) పాయింట్లు పతనమై 13,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. గతవారం 47,000 పాయింట్లను క్రాస్ చేసిన సెన్సెక్స్, నేడు 45,600 దిగువకు పతనమైంది. ఓ సమయంలో 2,000 పాయింట్లు నష్టపోయి 45,000 దిగువకు వెళ్లేలా కనిపించింది. చివరి రెండు గంటల్లో భారీగా నష్టపోయిన సెన్సెక్స్ ,చివరి అరగంటలో కాస్త కోలుకొని, 2000 పాయింట్ల నష్టం నుండి తేరుకొని, 1400 పాయింట్ల నష్టంతో ముగిసింది. భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్లు ఈ రోజు ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు నష్టపోయారు..

అన్నీ నష్టాల్లోనే...
నేడు అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు పీఎస్‌యూ బ్యాంకు సూచీ 7 శాతం పతనమైంది. మెటల్, ఇన్ఫ్రా, బ్యాంకు, ఆటో, ఎనర్జీ సూచీలు 4 శాతం నుండి 5 శాతం మేర పడిపోయాయి.
580 షేర్లు లాభాల్లో, 2,381 షేర్లు నష్టాల్లో ముగియగా, 163 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
నిఫ్టీ 50 స్టాక్స్‌లోని అన్ని కూడా నష్టాల్లో ముగిశాయి. ONGC, టాటా మోటార్స్, గెయిల్, హిండాల్కో, IOC వంటి దిగ్గజ స్టాక్స్ నష్టపోయాయి.
డాలర్ మారకంతో రూపాయి 21 పైసలు క్షీణించి 73.78 వద్ద ముగిసింది. డొమెస్టిక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ప్రభావం చూపింది. నేడు ఉదయం 18 పైసలు లాభపడి 73.75 వద్ద ప్రారంభమైంది. గత శుక్రవారం 73.57 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 73.64-73.82 మధ్య ట్రేడ్ అయింది.
నాల్కో స్టాక్ 8 నెలల కనిష్టానికి చేరుకుంది. జీ ఎంటర్టైన్మెంట్ షేర్ 6 నెలల కనిష్టానికి, పెట్రోనాట్ ఎల్ఎన్జీ 9 నెలల కనిష్టానికి, ఎన్బీసీసీ ఇండియా స్టాక్ 8 నెలల కనిష్టానికి, ఫస్ట్ సోర్స్ స్టాక్ ఆరు నెలల కనిష్టానికి, ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ 7 ఏడు నెలల గరిష్టానికి, ఐటీసీ ఏడు నెలల కనిష్టానికి, బీఈఎల్ 3 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇండియా VIX భారీగా ఎగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 4 శాతం మేర నష్టపోయాయి.

కారణాలు ఇవే..
- అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో కొత్త రకం వైరస్ భయాన్ని కలిగిస్తోంది. దీంతో ఐరోపా దేశాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది ఆసియా మార్కెట్లు, భారత మార్కెట్లపై ప్రభావం చూపింది.
- యూరోప్ ప్రాంతాల్లో కొత్త కరోనా కేసుల నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో మధ్యాహ్నం నుండి మన మార్కెట్లు పతనమయ్యాయి.
- లండన్ నుండి భారత్‌కు లేదా భారత్ నుండి లండన్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. డిసెంబర్ 22వ తేదీ (ఈ అర్ధరాత్రి) నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఇది వర్తిస్తుంది.
- ఇన్నాళ్లు మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్, అమెరికాల్లో తాజా కరోనా కేసుల భయంతో ప్రాఫిట్ బుకింగ్ చేశారు.

రంగాలవారీగా..
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ONGC 9.24 శాతం, టాటా మోటార్స్, 8.86 శాతం, గెయిల్ 8.28 శాతం, IOC 7.29 శాతం, హిండాల్కో 7.04 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, లార్సన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 4.62 శాతం, నిఫ్టీ బ్యాంకు 4.10 శాతం, నిఫ్టీ ఎనర్జీ 4.96 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.27 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.79 శాతం, నిఫ్టీ ఐటీ 1.77 శాతం, నిఫ్టీ మీడియా 6.20 శాతం, నిఫ్టీ మెటల్ 5.54 శాతం, నిఫ్టీ ఫార్మా 3.79 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 6.93 శాతం, నిఫ్టీ రియాల్టీ 5.25 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 4.11 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications