Market crash: సెన్సెక్స్ 1200 పాయింట్లు పతనం, ఇన్ఫోసిస్ 7% డౌన్

స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే కుప్పకూలింది! గతవారం 1100 పాయింట్లు నష్టపోయిన సూచీలు, ఈ వారం మొదటి గంటలోనే అంతకుమించి నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 57,500 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 17200 పాయింట్ల దిగువకు వచ్చింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అయితే ఏకంగా 7 శాతం క్షీణించింది. త్రైమాసిక ఫలితాల తర్వాత కూడా కోలుకోలేదు. టీసీఎస్ కూడా 1.5 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ గతవారం 58,339 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు ఆరంభమే 1000 పాయింట్ల మేర నష్టపోయి 57,338 పాయింట్ల వద్ద మొదలైంది. 57,420 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,152 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.10 సమయానికి సెన్సెక్స్ 1170 పాయింట్లు నష్టపోయి 57,172 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో దాదాపు 1200 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 308 పాయింట్లు క్షీణించి 17,167 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

Sensex tanks 1200 points, Nifty above 17,200: Infosys drops 7%

రంగాలవారీగా చూస్తే ఐటీ రంగం 4 శాతం మేర నష్టాల్లో కనిపించింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. బ్యాంకింగ్ సూచీ 1 శాతం క్షీణించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, గ్యాస్ అండ్ పెట్రోలియం, ఆటో, టెలికమ్యూనికేషన్స్, సిమెంట్ రంగాల్లో మాత్రమే కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. అయితే దిగ్గజ స్టాక్స్ అన్నీ ఐటీ, బ్యాంకింగ్ కాబట్టి మార్కెట్లు భారీగా నష్టాల్లో ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్భణం నమోదవడం మార్కెట్లలో అప్రమత్తత కనిపించింది. అమెరికా అధిక ద్రవ్యోల్భణం కూడా ప్రభావం చూపింది. పరపతి విధానం కఠినంగా ఉండవచ్చుననే అంచనాలతో విదేశీ నిధుల ప్రవాహం స్తబ్దుగా ఉండొచ్చునని భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ ప్రభావంపైన దృష్టి సారిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+