దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(మార్చి 7) భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌లో దాడులను మరింత ముమ్మరం చేసింది మాస్కో. దీంతో బ్యారెల్ చమురు ధర 130 డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణ భయాలు కమ్ముకున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా పైన ఇప్పటికే చాలా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పూర్తి సంతృప్తిగా లేరు. రష్యా నుండి దిగుమతి అవుతున్న చమురును ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు చిప్ కొరత వాహన రంగాన్ని మరింత చిక్కుల్లోకి నెడుతోంది. ఈ పరిణామాలన్నీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారత్, ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ భారీ నష్టాలకు కారణం.

ఏడు నెలల తర్వాత ఈ స్థాయి దిగువకు
సెన్సెక్స్ నేడు 53,172 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,172 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,597 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,867 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,906 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,774 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఏడు నెలల తర్వాత 53,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లు. నేడు 52,597 పాయింట్ల వద్ద కూడా ట్రేడ్ అయింది. అంటే ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు 10,000 పాయింట్లు తక్కువగా ఉంది. ఉదయం గం.10.18 సమయానికి సెన్సెక్స్ 1697 పాయింట్లు లేదా 3.12 శాతం క్షీణించి 52,636 పాయింట్ల వద్ద, నిఫ్టీ 460 పాయింట్లు లేదా 2.83 శాతం క్షీణించి 15,785 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. రెండు కూడా 3 పాయింట్ల మేర క్షీణించాయి.

రూపాయి బలహీనం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మన దేశంలో మెటల్ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంకు, క్యాపిడల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, రియాల్టీ రంగాలు 2 శాతం నుండి 5 శాతం చొప్పున క్షీణించాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 76.96 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 77 స్థాయిలో ఉంది. ఇది రికార్డ్ కనిష్టం.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, హిండాల్కో, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, లార్సన్ ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications