Market Crash: భారతీయ స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ చివరి రోజున పెద్ద కుదుపుకు గురైంది. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు అదే బేర్ మెుమెంటం కొనసాగించాయి. ఈ క్రమంలో మార్కెట్లలోని అన్ని కీలక సూచీలు ఎరుపెక్కి నష్టాల్లోకి జారుకున్నాయి.
మధ్యాహ్నం 12.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 987 పాయింట్ల నష్టంతో ఉండగా ఇంట్రాడేలో 1000 పాయింట్లకు పైగా పతనాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 280 పాయింట్లకు పైగా పతనంతో ముందుకు సాగుతోంది. ఇన నిఫ్టీ బ్యాంక్ సూచీ 744 పాయింట్ల క్షీణతను నమోదు చేసింది. ఈ సమయంలో ఇండియా విక్స్ సూచీ సైతం 8 శాతం పెరగటం ఆందోళనకు అద్ధం పడుతోంది. నిపుణుల నేటి మార్కెట్ల క్రాష్ పై స్పందిస్తూ ప్రధానంగా భారతీయ మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ట్యాంక్ అయినట్లు చెబుతున్నారు.

విస్తృత మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పడిపోయింది. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్లలో కొనసాగిన పతనం మార్కెట్లను మరింతగా కిందకు లాగింది. తాజా క్షీణతకు ముందు గడచిన 6 ట్రేడింగ్ సెషన్లలో బెంచ్ మార్క్ సూచీల బుల్ జోరు మార్కెట్లలో కొనసాగింది.
ప్రధానంగా యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించిన తర్వాత నిఫ్టీ సూచీ 3 శాతం ర్యాలీని చూసింది. ఇది మరింత విదేశీ పెట్టుబడి ప్రవాహాల అంచనాలను బలపరిచింది. ప్రధాన ట్రిగ్గర్లు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు ఇటీవలి లాభాలను క్యాష్ చేసుకోవడానికి ప్రేరేపించారు.
2022-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కోటి కంటే పైన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ నిర్వహించిన ట్రేడర్లు సగటున రూ.2 లక్షల నష్టాన్ని చూసినట్లు సెబీ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో సెబీ ఆప్షన్స్ ట్రేడింగ్ అదుపుచేసేందుకు సాధారణ ఇన్వెస్టర్లను నష్టాలకు దూరంగా ఉంచేందుకు ఒక కన్సల్టేషన్ పేపర్ ఉంచింది. ఇందులో ప్రతిపాదించిన 7 అంశాల కారణంగా ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ 30-40 శాతం తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిని సెబీ అమలులోకి తెచ్చే అవకాశం ఉందని నేడు మీడియాలో కథనాలు రావటం కూడా మార్కెట్ల పతనానికి దారితీసిందని తెలుస్తోంది.
ఇక గ్లోబల్ మార్కెట్లను పరిశీలిస్తే.. జపాన్ మార్కెట్లు నేడు పతనాన్ని చూశాయి. కొత్త ప్రధాని వచ్చిన తర్వాత డిసెంబర్ 2024లో జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నట్లు నోమురా వెల్లడించింది. ఇదే సమయంలో చైనా షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు స్వల్ప లాభాలను చూశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియోలను చైనా స్టాక్‌ల పనితీరు ప్రభావితం చేస్తుంది. చైనాలో ఇటీవల ప్రకటించిన ద్రవ్య ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో మార్కెట్లు మంచి పెరుగుదలను చూశాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications