ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (18 ఫిబ్రవరి) మందకోడిగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. అయితే కొన్ని రంగాలు భారీ లాభాల్లో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ 4 శాతం లాభపడగా, మెటల్, ఐటీ, ఎనర్జీ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బైబ్యాక్ ఆమోదం నేపథ్యంలో గెయిల్ స్టాక్స్ 7 శాతం వరకు లాభపడ్డాయి. ఓఎన్జీసీ స్టాక్స్ 6.5 శాతం ఎగిశాయి.
సెన్సెక్స్ నిన్న కూడా భారీ నష్టాల్లో ముగిసింది. బడ్జెట్ అనంతరం వరుసగా లాభపడిన మార్కెట్లు, మధ్యలో రెండు మూడు సెషన్లలో దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న 400 పాయింట్లు నష్టపోయింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 72.76 వద్ద ట్రేడ్ అయింది. నిన్న 72.75 వద్ద క్లోజ్ అయింది.

400 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ ఉదయం గం.9.16 సమయానికి 12.92 పాయింట్లు లేదా 0.02 శాతం నష్టపోయి 51,690.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2.20 పాయింట్లు లేదా 0.01% క్షీణించి 15,206.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 862 షేర్లు లాభాల్లో, 346 నష్టాల్లో ప్రారంభం కాగా 61 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
మధ్యాహ్నం గం.12.28 సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు క్షీణించి 51,305 పాయిట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 92 పాయింట్లు క్షీణించి 15,117 పాయింట్ల వద్ ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 7.74 శాతం, ONGC 7.58 శాతం,
IOC 4.00 శాతం, కోల్ ఇండియా 2.74 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.68 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలోICICI బ్యాంకు 2.79 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 2.34 శాతం, HDFC 2.24 శాతం, శ్రీసిమెంట్స్ 2.27 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.18 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, గెయిల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు మరో 0.25 శాతం లాభపడి రూ.2,088 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.57 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.37 శాతం లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎనర్జీ 2.24 శాతం, నిఫ్టీ ఐటీ 0.44శాతం, నిఫ్టీ మెటల్ 1.21 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.47 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.93 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.40 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.23 శాతం, నిఫ్టీ మీడియా 0.45 శాతం, నిఫ్టీ ఫార్మా 0.46 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.29 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications