For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిసారి 61,000 దాటిన సెన్సెక్స్, అందుకే మార్కెట్ అదరగొట్టింది

|

స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 14) భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ దాదాపు 570 పాయింట్ల లాభంతో ముగిసింది. మొదటిసారి 61,000 పాయింట్లను క్రాస్ చేసింది. ప్రీమార్కెట్‌ సెషన్‌లో సెన్సెక్స్ 61,600కు కూడా చేరుకుంది. ఇక నిఫ్టీ 18,350 పాయింట్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ఇటీవల వరుసగా రెండు ఐటీ కంపెనీలు ఫలితాలను ప్రకటించాయి.

టీసీఎస్, విప్రోలు FY22 రెండో త్రైమాసికంలో అదరగొట్టాయి. దీంతో ఈ స్టాక్స్ ఇటీవల లాభపడుతున్నాయి. నేడు మరో 21 కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో ఐటీ దిగ్గజం HCL టెక్, సైయంట్, డెన్ నెట్ వర్క్ వంటివి ఉన్నాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం వ్యాల్యూ 75.26 వద్ద ముగిసింది.

ఆల్ టైమ్ గరిష్టానికి

ఆల్ టైమ్ గరిష్టానికి

సెన్సెక్స్ నేడు ఉదయం 61,088.82 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,353.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,978.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 61,353.25 కాగా, 52 వారాల కనిష్టం 39,241.87 పాయింట్లు. సెన్సెక్స్ క్రితం సెషన్‌‍లో 60,737.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 18,272.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,350.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,248.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

52 వారాల గరిష్టం 18,350.75 కాగా, 52 వారాల కనిష్టం 11,535.45 పాయింట్లు. క్రితం సెషన్‌లో 18,161.75 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో సెన్సెక్స్ 568.90 (0.94%) పాయింట్లు లాభపడి 61,305.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 176.80 (0.97%) పాయింట్లు లాభపడి 18,338.55 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు నేడు సరికొత్త రికార్డును తాకాయి. నిఫ్టీ వరుసగా 6వ రోజు లాభపడింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

HDFC బ్యాంకు, ఐటీసీ స్టాక్స్ భారీగా వృద్ధి చెందడంతో మార్కెట్ లాభాలకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 22 లాభాల్లో ముగిశాయి. బ్యాంకు, మెటల్, ఐటీ స్టాక్స్ నేడు అదరగొట్టాయి. ఈ వారం రెండు సూచీలు కూడా రెండు శాతం మేర లాభపడ్డాయి. అక్టోబర్ 15వ తేదీన దసరా పర్వదినం సందర్భంగా మార్కెట్‌కు సెలవు రోజు.ఈ రోజు మార్కెట్లు ఐదు రోజులు మాత్రమే వర్క్ చేశాయి. రేపు దసరా సందర్భంగా వర్క్ చేయదు. ఆ తర్వాత శనివారం, ఆదివారం మార్కెట్లకు సాధారణ సెలవులు.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 7.09 శాతం, విప్రో 5.30 శాతం, గ్రాసీమ్ ఇండస్ట్రీస్ 4.50 శాతం, ఐటీసీ 2.95 శాతం, HDFC బ్యాంకు 2.93 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 3.29 శాతం, టాటా మోటార్స్ 1.83 శాతం, ఐర్ మోటార్స్ 1.81 శాతం, టీసీఎస్ 1.20 శాతం, HCL టెక్ 1.12 శాతం నష్టపోయాయి.

టీసీఎస్ స్టాక్ నేడు అదరగొట్టింది. నేడు ఈ స్టాక్ ఏకంగా 5.41 శాతం లేదా రూ.36.40 లాభపడి రూ709.00 వద్ద క్లోజ్ అయింది. నేడు ఓ సమయంలో భారీగా లాభపడి రూ.739.85 వద్ద ట్రేడ్ అయింది. విప్రోకు 52 వారాల గరిష్టం ఇదే కావడం గమనార్హం.

అందుకే లాభాల్లో

అందుకే లాభాల్లో

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్ అండ్ పీ 0.30 శాతం లాభపడగా, డౌజోన్స్ దాదాపు స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలతలకు తోడు దేశీయ పరిణామాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే కేంద్రం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు చేసింది. ఇది దాదాపు సఫలమైనట్లుగా ఉంది. ముంద్రా ప్లాంట్‌ను టాటా తిరిగి ప్రారంభించింది. ఇలా వరుస సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

English summary

తొలిసారి 61,000 దాటిన సెన్సెక్స్, అందుకే మార్కెట్ అదరగొట్టింది | Sensex surpasses 61,000 for the first time, Nifty ends above 18,300

Except auto, all other sectoral indices ended in the green, with infra, IT, realty, PSU Bank, power and metal indices were up a percent each.
Story first published: Thursday, October 14, 2021, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X