ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో ఐటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది. మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే లాభాల్లో కొనసాగి, చివరకు సరికొత్త గరిష్టాలను తాకి, ముగిశాయి.
మధ్యలో కొన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ఓ దశలో సెన్సెక్స్ తడబడినట్లు కనిపించినా ఎక్కువ సేపు నిలువలేదు. నిన్న 52,904 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు 52,968.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,266.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,948.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,872.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,952.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,855.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 254.80 (0.48%) పాయింట్లు ఎగిసి 53,158.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70.25 (0.44%) లాభపడి 15,924.20 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్, లార్సన్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్ ఉన్నాయి. HCL టెక్, లార్సన్, టెక్ మహీంద్రా, విప్రో, హిండాల్కో టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications