మూడ్రోజుల్లో 2100 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు సెన్సెక్స్ 1041 పాయింట్లు లేదా 1.90 శాతం, నిఫ్టీ 309 పాయింట్లు లేదా 16,661 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ గత మూడ్రోజుల్లో ఏకంగా 2100 పాయింట్లు లాభపడింది. గత కొద్ది వారాలుగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలను నమోదు చేస్తున్న ఇన్వెస్టర్లకు సోమవారం భారీ ఊరట లభించింది. ఉదయం నుండి మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ఏ దశలోను నష్టాల్లోకి రాలేదు.

బలమైన అంతర్జాతీయ సంకేతాలకు తోడు ఆర్థిక మందగమనం ఆందోళనలు సన్నగిల్లడం, చైనాలో కరోనా ఆంక్షల ఎత్తివేత, డాలర్ బలహీనత మార్కెట్లకు కలిసి వచ్చింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు, రేట్ల పెంపు, ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణ ప్రభావాలను మార్కెట్లు జీర్ణం చేసుకున్నాయి. కొత్త ఆందోళనలు లేకపోవడంతో మార్కెట్లకు కనిష్టాల వద్ద మద్దతు లభించింది.

Sensex surges 2,100 points in Three days

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, లార్సన్ ఉన్నాయి. ఇవి 3 శాతం నుండి 5 శాతం మేర లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా 2 శాతానికి పైగా నష్టపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+