ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదు రోజుల పాటు సూచీలు పతనమయ్యాయి. ఈ రోజు కూడా ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కాస్త తేరుకున్నాయి. మధ్యాహ్నం సెషన్‌కు ముందే లాభాల్లోకి వచ్చి, క్లోజింగ్‌కు ముందు చివరి గంటలో ఎగిసిపడ్డాయి. సెన్సెక్స్ చివరి ఐదు సెషన్లలో 2000 పాయింట్లకు పైగా పతనమై 51వేల పాయింట్ల పై నుండి నిన్నటికి 49,216 పాయింట్ల వద్దకు చేరుకుంది. అయితే నేడు 600 పాయింట్లకు పైగా లాభపడింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.

వరుస నష్టాలు... కొనుగోళ్ళు
సెన్సెక్స్ ఉదయం 48,881.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,003 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,586.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,471 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,788.25 వద్ద గరిష్టాన్ని, 14,350.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 1271 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. కీలక రంగాల్లో మద్దతు లభించడంతో ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.52 వద్ద నిలిచింది. మధ్నాహ్నం తర్వాత విద్యుత్, యుటిలిటీస్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, లోహ రంగ షేర్లతో పాటు కీలక కంపెనీల షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతేకాదు, ఐదు రోజుల పాటు నష్టాలు నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు కనిష్టం వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్బీఐ ఉన్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో NTPC 4.53 శాతం, HUL 4.37 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.14 శాతం, JSW స్టీల్ 4.11 శాతం, UPL 4.02 శాతం లాభాల్లో ముగిశాయి.టాప్ లూజర్స్ జాబితాలో లార్సన్ 1.18 శాతం, టెక్ మహీంద్రా 0.68 శాతం, కోల్ ఇండియా 0.55 శాతం, బజాజ్ ఆటో 0.39 శాతం, టైటాన్ కంపెనీ 0.19 శాతం నష్టపోయాయి.
సూచీలు ఈ వారం చివరి సెషన్లో లాభపడినప్పటికీ, గత ఐదు రోజులు నష్టాలను నమోదు చేశాయి. ఈ కాలంలో సెన్సెక్స్ 2000 పాయింట్లు నష్టపోగా, నేడు 640 పాయింట్లు ఎగిసింది. ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ చెరో రెండు శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 4 శాతం, మిడ్ క్యాప్ సూచీలు 2.8 శాతం నష్టపోయింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభపడ్డాయి. ఐటీసీ 8.6 శాతం మేర లాభపడింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.28 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.54 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.42 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.90 శాతం, నిఫ్టీ ఎనర్జీ 3.16 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.86 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.43 శాతం, నిఫ్టీ ఐటీ 0.75 శాతం, నిఫ్టీ మీడియా 0.94 శాతం, నిఫ్టీ మెటల్ 2.08 శాతం, నిఫ్టీ ఫార్మా 1.33 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.47 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.91 శాతం లాభపడ్డాయి. కేవలం నిఫ్టీ రియాల్టీ 0.53 శాతం క్షీణించింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications