ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 26) లాభాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సెన్సెక్స్ 47,878 వద్ద క్లోజ్ అయింది. నేడు 48,000 పైనే ట్రేడ్ అయింది. ఓ సమయంలో 800 పాయింట్ల మేర కూడా లాభపడింది. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సరైన మార్గంలోన్న నిపుణుల అంచనాలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సానుకూలతను తెచ్చిపెట్టింది.
కొంతకాలం క్రితం వరకు కరోనాతో కొట్టుమిట్టాడిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అమెరికా కంటే వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు అంతర్జాతీయ సూచీల సెంటిమెంటును బలపరిచాయి. అలాగే, కరోనా ఉధృతిని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపాయి.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ ఉదయం 48,197.37 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,667.98 వద్ద గరిష్టాన్ని, 48,152.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో 800 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ ఉదయం గం.10.45 సమయానికి 675.23 (1.41%) పాయింట్లు లాభపడి 48,553.74 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,449.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,557.50 వద్ద గరిష్టాన్ని, 14,421.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 177.80 (1.24%) పాయింట్లు ఎగిసి 14,519.15 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
ఫైనాన్షియల్ స్టాక్స్ అదరగొడుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్‌గా ఉంది. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.
మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ICICI బ్యాంకు 5.10 శాతం, యాక్సిస్ బ్యాకు 3.32 శాతం, ఎస్బీఐ 2.84 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.75 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.28 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HCL టెక్ 2.49 శాతం, బ్రిటానియా 1.99 శాతం, సిప్లా 1.47 శాతం, టెక్ మహీంద్రా 0.95 శాతం, సన్ ఫార్మా 0.82 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.67 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.04 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.44 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.82 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.46 శాతం, నిఫ్టీ ఐటీ 0.50 శాతం, నిఫ్టీ మీడియా 0.21 శాతం, నిఫ్టీ మెటల్ 1.60 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.66 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.04 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.40 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.06 శాతం మాత్రం నష్టపోయింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications