For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లు నష్టాల్లో ముగిసినా, ఈ స్టాక్స్ మాత్రం 15% లాభపడ్డాయి

|

స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మంగళవారం(నవంబర్ 16) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఏ దశలోను లాభాల్లోకి రాలేదు. డాలర్ ఇండెక్స్ పెరగడం, అమెరికా టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ పెరగడం, హోల్ సేల్ ద్రవ్యోల్భణం ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం వంటి వివిధ అంశాలు ప్రభావం చూపి మార్కెట్లు నష్టపోయాయి. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రిలయన్స్, ఎస్బీఐ, HDFC జంట షేర్లు, ఐసీఐసీఐ వంటి దిగ్గజ కంపెనీలు నష్టపోవడం ఈ స్థాయి నష్టాలకు ప్రధాన కారణం.

నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు

ఉదయం సెన్సెక్స్ 60,755.38 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,802.79 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,199.56 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 396.34 (0.65%) పాయింట్లు లాభపడి 60,322.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,127.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,132.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,958.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 110.25 (0.61%) పాయింట్లు నష్టపోయి 17,999.20 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 60400 పాయింట్ల దిగువన, నిఫ్టీ 18000 పాయింట్ల పాయింట్ల దిగువన ముగిసింది.

ఈ స్టాక్స్ 15 శాతం జంప్

ఈ స్టాక్స్ 15 శాతం జంప్

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అయితే పలు స్టాక్స్ లాభాల్లో ముగిసినప్పటికి కొన్ని మాత్రం ఏకంగా 15 శాతం మేర లాభపడ్డాయి. అందులో తంబోలీ క్యాపిటల్ (19.94%), బిగ్ బ్లాక్ కన్సల్టెన్సీ(19.93%), విశాల్ బేరింగ్స్(19.91%), లాయల్ ఎక్విప్‌మెంట్స్(19.89%), మనోమే టెక్స్ ఇండియా(19.64%), వైట్ ఆర్గానిక్ ఆగ్రో(19.29%), పంజాబ్ అల్కలైస్(18.67%), సన్ కేర్ ట్రేడర్స్(18.64%), పెరల్ గ్లోబల్ (17.15%), టీవీ టుడే నెట్ వర్క్(16.9%).

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, రిలయన్స్, HDFC ఉన్నాయి.

మారుతీ సుజుకీ 7.29 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.44 శాతం, టాటా మోటార్స్ 2.69 శాతం, హీరో మోటో కార్ప్ 2.14 శాతం, టెక్ మహీంద్రా 1.31 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 3.23 శాతం, రిలయన్స్ 2.32 శాతం, SBI 2.26 శాతం, హిండాల్కో 2.26 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 2.25 శాతం నష్టపోయాయి.

English summary

మార్కెట్లు నష్టాల్లో ముగిసినా, ఈ స్టాక్స్ మాత్రం 15% లాభపడ్డాయి | Sensex snaps 2 day winning run as inflation woes spook market bulls

Benchmark indices snapped two-day gaining streak on Tuesday as they faced selling pressure thanks to increased worries over rising inflation across the world.
Story first published: Tuesday, November 16, 2021, 19:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X